India Corona : 11 లక్షల మందికి పరీక్షలు…8 వేల మందికి వైరస్
దేశంలో 98.36 శాతం కరోన రికవరీ రేటుగా ఉందని, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,40,28,506గా ఉందని వెల్లడించింది....

India Corona
India Corona Update : భారత్ లో కరోనా కట్టడిలోనే ఉంది. తక్కువ సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయని, తాజాగా లక్ష దిగువకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. మంగళవారం 11,08,467 మంది కోవిడ్ పరీక్షలు నిర్వహించగా…8,954 కరోనా పాజిటివ్ కేసులు, 267 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. కొత్త కేసులు పది వేలకు దిగువనే ఉన్నా..ముందురోజు కంటే పెరిగాయి. 10 వేల 207 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో 99,023 యాక్టీవ్ కేసులున్నాయిన, దేశంలో 0.29 శాతంగా యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 3,45,96,776 కేసులు, 4,69,247 మరణాలు సంభవించాయని పేర్కొంది.
Read More : TTD : తిరుపతి యాత్రను 15 రోజుల పాటు వాయిదా వేసుకోవాలి
దేశంలో 98.36 శాతం కరోన రికవరీ రేటుగా ఉందని, ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,40,28,506గా ఉందని వెల్లడించింది. మరోవైపు…భారత్ లో 320 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 124.10 కోట్ల డోసుల టీకాలు అందచేశారు. మంగళవారం 80,98,716 డోసుల టీకాలు అందచేయగా..ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 124,10,86,850 డోసుల టీకాలు అందవేయడం జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకపక్క..కరోనా గణంకాలు కొంత ఊరటనిస్తున్నా…ఒమిక్రాన్ ప్రజలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు అధికమౌతుండడంతో భారత్ అప్రమత్తమైంది. పలు నిబంధనలు, ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ కేసులు భారత్ లో వెలుగు చూడలదని కేంద్రం వెల్లడించింది. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.