దటీజ్ మోడీ : దేశ అప్పు రూ. 82 లక్షల కోట్లు

  • Publish Date - January 20, 2019 / 06:42 AM IST

ఢిల్లీ : భారతదేశ అప్పు ఎంతుందో తెలుసా ? భారత ప్రధాన మంత్రిగా నరేంద్రమోడీ వచ్చిన తరువాత దేశ అప్పు విపరీతంగా పెరిగిపోతోంది. గత నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అప్పు చేసింది ఏకంగా 49 శాతానికి పెరిగి…రూ. 82,03,253 లక్షల కోట్లకు చేరింది. నాలుగున్నరేళ్ల క్రితం ఇది రూ. 48 లక్షల కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ జనవరి 19వ తేదీన శనివారం ప్రకటించింది. అప్పులపై కేంద్ర ప్రభుత్వం నివేదికను విడుదల చేసింది. 

  • బీజేపీ ప్రభుత్వం కొలువు దీరిన 2014 జూన్ నాటికి ప్రభుత్వ రుణాలు రూ.54,90,763. మోడీ హయాంలో సర్కారీ రుణాలు మరో రూ.27,12,490 కోట్లు పెరిగాయి.

  • మొత్తం కేంద్రం రుణాలు రూ.82,03,253 కోట్లు. 

  • పబ్లిక్ డెబ్ట్ రూ. 48 లక్షల కోట్ల నుండి 51.7 శాతం పెరుగుతూ రూ. 73 లక్షల కోట్లకు చేరింది. ఇందులో ఇంటర్నల్ డెబ్ట్ రూ. 68 లక్షల కోట్లు.

  • గోల్డ్ బాండ్ల ద్వారా తీసుకున్న అప్పు రూ. 9 వేల కోట్లు. 2014లో ఏమీ లేదు. 

  • మార్కెట్ ఆధారిత రుణాలూ గతంతో పోల్చితే 47.5 శాతం పెరిగి రూ.52 లక్షల కోట్లకు పేరుక పోయాయి.