Telangana : గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 107వ ర్యాంక్‌కు దిగజారిన భారత్ .. మోడీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 101వ స్థానంనుంచి భారత్ 107వ ర్యాంక్‌కు దిగజారింది.. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. NPA ప్రభుత్వం సాధించిన మరో అద్భుత విజయం అంటూ సెటైర్లు వేశారు.

India has fallen from 101 to 107 in Global Hunger Index..

Telangana : ఈ రోజు మోడీ ప్రభుత్వం మరో అద్భుతమైన విజయం సాధించింది..గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101వ స్థానం నుంచి 107వ ర్యాంక్‌కు దిగజారింది అంటూ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వైఫల్యాన్ని అంగీకరించటానికి బదులు, బీజేపీ జోకర్లు ఈ నివేదికను భారత వ్యతిరేక నివేదికగా కొట్టిపారేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటూ ట్విట్టర్ వేదికంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఆకలి సూచీలో భారత్ అట్టడుగున చేరింది. 121 దేశాల జాబితాతో విడుదలైన హంగర్ ఇండెక్స్‌లో భారత్ 107 స్థానంలో నిలిచింది. ఈ అంశంపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ట్విట్టర్‌ వేదిక NPA గవర్నమెంట్‌ సాధించిన మరో అద్భుతమైన విజయం ఇది అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఆకలి సూచీలో భారత్ 101వ స్థానం నుంచి 107వ స్థానానికి చేరిందని..ఈ ఫెయిల్యూర్‌ను బీజేపీ జోకర్స్ అంగీకరించకుండా‌.. భారత్‌కు వ్యతిరేకంగా వచ్చిన నివేదిక అని కొట్టిపారేస్తారని తాను అనుకుంటున్నానని పేర్కొన్నారు.

కాగా భారతదేశం 121 దేశాలలో గ్లోబ్ హంగర్ ఇండెక్స్(GHI) 2022లో 2021,101వ స్థానం నుంచి 107వ స్థానానికి పడిపోయింది. భారత పొరుగు దేశాలైన శ్రీలంక (64వ ర్యాంక్‌), నేపాల్‌ (81), బంగ్లాదేశ్‌ (84), పాకిస్థాన్‌ (99) మన దేశం కన్నా ముందున్నాయి. దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్‌ (109 ర్యాంక్‌) ఉంది.

చైనా, టర్కీ, కువైట్‌తో సహా17 దేశాలు ఐదు కంటే తక్కువ GHI స్కోర్‌తో టాప్ ర్యాంక్‌ను పంచుకున్నాయని ఆకలి మరియు పోషకాహార లోపాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (hunger and malnutrition)వెబ్‌సైట్ శనివారం (అక్టోబర్ 15,2022) తెలిపింది.

ఈ పరిస్థితిపై కాంగ్రెస్ నేత మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్పందిస్తూ..నరేంద్ర మోడీ నేతృత్వంలోని 8 సంవత్సరాల పాలనలో 2014 నుంచి ర్యాంకు మరింతగా దిగజారిందని అన్నారు. పిల్లల పోషకాహార లోపం, ఆకలి వంటి వాస్తవ సమస్యలను గౌరవనీయమైన ప్రధాని ఎప్పుడు ప్రస్తావిస్తారు? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వర్ల్డ్ వైడ్, జర్మన్ సంస్థ వైల్డ్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో భారత్ ఆకలి స్థాయిన తీవ్రమైనది పేర్కొంది. కాగా..2011లో 116 దేశాల్లో భారత్ ర్యాంక్ 101 స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ లికస్టులో 121 దేశాల్లో భారత్ 107ర్యాంకుకు పడిపోయింది. భారతదేశం GHI స్కోర్ కూడా క్షీణించింది. 2000లో 38.8 నుంచి 2014 మరియు 2022 మధ్య 28.2-29.1 పరిధిలో ఉంది.