Usa
Antony Blinken: అగ్ర రాజ్యం అమెరికా మరోసారి భారత్ పై అక్కసు వెళ్లగక్కింది. జో బైడెన్ పాలనలో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్న అమెరికా ఇప్పటికే అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకోగా..మిత్ర దేశాలను సైతం శత్రువులుగా చూస్తూ..అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవాలని చూస్తుంది. భారత్ లోని పుణ్యక్షేత్రాలు..ప్రజలపై దాడులు పెరిగిపోయాయంటూ అమెరికా జాతీయ ప్రధాన కార్యదర్శి.. ఆంటోనీ బ్లింకెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛ కోసం ఆయా వర్గాల పక్షాన అమెరికా అండగా నిలబడుతుందన్న ఆంటోనీ.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు చైనా వంటి ఇతర ఆసియా దేశాలలో మైనారిటీ వర్గాల ప్రజలు మరియు మహిళల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై గురువారం విడుదల చేసిన వార్షిక నివేదిక సమావేశం సందర్భంగా బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Other Stories: CAA: సీఏఏను కేరళలో అమలు చేయబోం – కేరళ సీఎం
మత స్వేచ్ఛను పెంపొందించడానికి ఇతర ప్రభుత్వాలు, బహుపాక్షిక సంస్థలు, పౌర సమాజంతో కలిసి పనిచేస్తూనే ఉంటామని ఈమేరకు జులైలో యూకేలో జరగనున్న మంత్రివర్గం సమావేశంలో పాల్గొని చర్చిస్తామని బ్లింకెన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత సామాజిక వర్గాల్లో మత స్వేచ్ఛకు, మైనారిటీల హక్కులకు భంగం కలుగుతుందని ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యానించారు. అందుకు ఉదాహరణగా భారత్ పేరును ప్రస్తావించాడు బ్లింకెన్. “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మరియు విభిన్న విశ్వాసాలకు నిలయమైన భారతదేశంలో, ప్రజలు మరియు ప్రార్థనా స్థలాలపై పెరుగుతున్న దాడులను మేము చూశాము; వియత్నాంలో నమోదుకాని మత సంఘాల సభ్యులను అధికారులు వేధించారు; నైజీరియాలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ విశ్వాసాలను వ్యక్తపరిచినందుకు ప్రజలను శిక్షించేందుకు పరువు నష్టం మరియు దైవదూషణ నిరోధక చట్టాలను ఉపయోగిస్తున్నాయి” అని బ్లింకెన్ అన్నారు.
Other Stories: Gyanvapi Mosque: ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు వెతుకుతున్నారు – ఆర్ఎస్ఎస్ చీఫ్
అయితే భారత్ లో ఎటువంటి దాడులు జరిగాయన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు బ్లింకెన్. చైనాలో బౌద్ధ, క్రైస్తవ, ఇస్లామిక్ మరియు తావోయిస్ట్ ప్రార్థనా మందిరాలను నాశనం చేస్తున్నారని, వారికి ఉపాధి లేకుండా, చేస్తూ కనీసం నిలువ నీడ లేకుండా చేస్తున్నారని బ్లింకెన్ అన్నారు. ISIS-K మతపరమైన మైనారిటీలపై, ముఖ్యంగా షియా హజారాలపై హింసాత్మక దాడులకు పాల్పడుతోందనీయో ఆయన తెలిపారు. “పాకిస్తాన్‌లో, దైవదూషణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది వ్యక్తులకు 2021లో పాకిస్తాన్ కోర్టులు మరణశిక్ష విధించాయి, అయితే ఈ శిక్షల్లో ఏదీ ఇంకా అమలు చేయబడలేదు” అని బ్లింకెన్ చెప్పారు. కాగా అమెరికా జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ భారత్ పై చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Other Stories: Amit Shah On Telangana : తెలంగాణలో త్వరలోనే ప్రభుత్వం మారబోతోంది-అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కాగా ఇటీవలి కాలంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను లెక్కచేయకుండా భారత్ రష్యాతో సఖ్యత కొనసాగించింది. అలాగే భారత్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ అమెరికా వేలెత్తి చూపడంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్, అమెరికాలోనూ మానవహక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. దీంతో సెల్ఫ్ డిఫెన్సె లో పడ్డ అమెరికా..సందుదొరికినప్పుడల్లా భారత్ పై అభాండాలు వేస్తూ..సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంది. ఇదే కాదు యూరోప్, మధ్యప్రాచ్య దేశాలు, ఇతర ఆసియ దేశాల్లో జరిగే అంతర్గత వ్యవహారాలపై అమెరికా జోక్యం చేసుకోవాలని చూస్తుంది.