Covid
Covid Active Cases : దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 527 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,28,555 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 12,134 మంది కరోనా నుంచి కోలుకునన్నారని..మొత్తం రికవరీ రేటు 98.27శాతంగా ఉందని,కరోనా ప్రారంభమైన మార్చి 2020 నుంచి ఇదే అత్యధిక రికవరీ రేటు అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు గడిచిన 54 రోజులుగా 0.96శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు గడిచిన 44 రోజులుగా 0.82 శాతం ఉందని వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం…గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,197 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 301 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,44,66,598కు చేరగా,మరణాల సంఖ్య 4,64,153కి చేరింది. ఇక కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో కేరళలోనే అత్యధికం ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో నిన్న 5516 కేసులు నమోదవగా,39 మంది మృతిచెందారు.
ALSO READ World’s ‘First’ Beach : ప్రపంచంలో “మొట్టమొదటి బీచ్” భారత్ లోనే