India Logs 3,688 New Covid Cases, Delhi Continues To See Spike In Infections
India Covid-19 : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత తగ్గినట్టే భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 3,688 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 50 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం (ఏప్రిల్ 30) హెల్త్ బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం దేశంలో 18,684 (0.04 శాతం)గా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.74 శాతం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 3,688 కొత్త కేసులు నమోదు కాగా.. ఢిల్లీలో 1,607 కొత్త కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు మొత్తంగా 188.89 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను అందించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 2,755 రికవరీలు నమోదయ్యాయి. దాంతో మొత్తంగా నమోదైన రికవరీల సంఖ్య 4,25,33,377కి చేరుకుంది. వారం పాజిటివిటీ రేటు 0.66 శాతంగా నమోదైంది.
India Logs 3,688 New Covid Cases, Delhi Continues To See Spike In Infections
గడచిన 24 గంటల్లో 4,96,640 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 83.74 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా ఢిల్లీలో 1,607 కరోనా కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత మొదటి ఐదు రాష్ట్రాల్లో 624 కేసులతో హర్యానా, 412 కేసులతో కేరళ, 293 కేసులతో ఉత్తరప్రదేశ్, 148 కేసులతో మహారాష్ట్ర ఉన్నాయి. దాదాపు 83.61 శాతం కొత్త కరోనా కేసులు ఈ ఐదు రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. ఒక్క ఢిల్లీలోనే 43.57 శాతం కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో దేశంలో మొత్తంగా 50 మరణాలు నమోదయ్యాయి, మొత్తం నివేదించిన మరణాల సంఖ్య 5,23,803కు పెరిగింది. గత 24 గంటల్లో కరోనా యాక్టివ్ కేసులు 883 వరకు పెరిగాయి.
Read Also : Covid cases: భారత్‌లో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. 17వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య