India Covid Cases : దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.72 లక్షల కేసులు, 1,008 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.

India Covid-19 Cases : భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి. కరోనా మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,72,433 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటాను గురువారం (ఫిబ్రవరి 3) వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో 1,008 కరోనా మరణాలు నమోదు అయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 15,33,921కి తగ్గింది. కరోనా రికవరీ రేటు 95.14 శాతంగా నమోదు అయింది. గురువారం నమోదైన రోజువారీ కరోనా కేసులు.. బుధవారం నమోదైన కేసుల కన్నా 6.8 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో యాక్టివ్ కాసేలోడ్ 87,682 తగ్గింది. మొత్తంగా గకరోనా కేసుల సంఖ్య 4,18,03,318కి చేరుకుంది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,67,87,93,137 కోవిడ్-19 వ్యాక్సిన్ డోస్‌లను అందించింది. మరోవైపు.. అత్యధిక సంఖ్యలో కోవిడ్ -19 కేసులను నమోదు చేసిన మొదటి ఐదు రాష్ట్రాలు కేరళలో 52,199 కేసులు, కర్ణాటకలో 20,505 కేసులు, మహారాష్ట్రలో 18,067 కేసులు, తమిళనాడులో 14,013 కేసులు, గుజరాత్‌లో 8,934 కేసులు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి 65.95 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి.

కొత్త కేసులలో 30.27 శాతం కేరళలోనే నమోదు కాగా.. భారత్ లో రికవరీ రేటు ఇప్పుడు 95.14 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో మొత్తం 2,59,107 మంది రోగులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,97,70,414కి చేరుకుంది.

Read Also : Puneeth Rajkumar : పునీత్ రాజకుమార్ ఫ్యామిలీని పరామర్శించడానికి బెంగుళూర్ పయనమైన అల్లు అర్జున్

ట్రెండింగ్ వార్తలు