×
Ad

Corona Cases : దేశంలో కొత్తగా 1,500 కరోనా కేసులు.. 12 మంది మృతి

ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు.

  • Published On : May 12, 2023 / 01:07 PM IST

Corona Cases (5)

Corona Cases : భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 1,500 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 12 గంటల్లో కరోనా బారిన పడి 12 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

దేశవ్యాప్తంగా శుక్రవారం 1,28,764 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 1,580 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. తాజాగా కేసులతో కలిపి మొత్తం 4,49,76,599 మంది వైరస్ బారిన పడ్డారు. దేశంలో ప్రస్తుతం 18,009 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Corona Virus : కరోనాతో మరణించిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత మళ్లీ బతికొచ్చాడు

ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.04శాతం మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి.

రికవరీ రేటు 98.77 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 220,66,88,357 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.