Corona Cases (4)
Corona Cases : భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 2,961 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 17మంది మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు 1,39,814 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,961 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,05,550 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,31,659కి చేరింది.
Corona Virus : కరోనాతో మరణించిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత మళ్లీ బతికొచ్చాడు
దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.07శాతం యాక్టివ్ గా ఉంది. రికవరీ రేటు 98.75శాతం కాగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 220,66,76,563 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.