Corona Deaths : దేశంలో ఒక్కరోజే 4వేలకు చేరువగా కరోనా మరణాలు

దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు

Corona Deaths : దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. నిన్న 18,52,140 మందిని పరీక్షించగా.. 42వేల 015 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ముందురోజు 30 వేలకు తగ్గిన కేసులు.. తాజాగా 40 శాతం మేరకు పెరిగాయి. ఇక మరణాలు మాత్రం 3వేల 998గా నమోదయ్యాయి.

దేశంలో కరోనా రోజువారీ మరణాలు దాదాపు 10 రెట్లు పెరగడం కలకలం రేపింది. క్రితం రోజు 374 మంది కొవిడ్ తో చనిపోగా, నేడు ఏకంగా 3వేల 998 మరణాలు సంభవించడం ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్ర మరణాల లెక్కను సవరించడంతో ఈ స్థాయిలో తేడా కనిపించిందని అధికారులు చెబుతున్నారు. ఆ రాష్ట్రం వెల్లడించిన మృతుల సంఖ్య 3వేల 656గా ఉంది. దేశంలో మొత్తం కేసులు 3.12కోట్లకు చేరగా.. 4.18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 4,07,170 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. 36,977 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే, నిన్న రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల రేటు 1.30 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది. మొత్తంగా 3.03కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు