India Reports 84332 New Covid 19 Cases And 4002 Deaths As Active Cases In The Country
Covid India reports: మరణ మృదంగం మ్రోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు సంఖ్య మాత్రం తగ్గలేదు. దేశంలో రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో లేటెస్ట్‌గా రోజువారీ కొవిడ్ కేసులు తాజాగా మరోసారి లక్షకు దిగువన నమోదవగా.. నాలుగువేలకుపైగా మరణాలు రికార్డయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 84,332 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇదే సమయంలో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు.
లేటెస్ట్‌గా 1,21,311మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,93,59,155 కరోనా కేసులు నమోదవగా.. 3,67,081 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 10,80,690 యక్టీవ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు కరోనా మరణాల తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. వ్యాక్సిన్ డ్రైవ్‌లో మొత్తం 24కోట్ల 96లక్షల 304 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 95.07శాతానికి పెరగగా.. పాజిటివిటీ రేటు 5శాతానికి పడిపోయింది. దేశంలో 4.39 శాతంగా పాజిటివిటి రేటు ఉందని చెబుతుంది ఆరోగ్యశాఖ. 19 రోజులుగా 10 శాతం దిగువన పాజిటివిటి రేటు నమోదవుతుంది.
నెల రోజులుగా కొత్త కేసులకన్నా రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. 30 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గాయి. నాలుగు రాష్ట్రాల్లోనే లక్షకు పైగా యక్టీవ్ కేసులు ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళలో అధికంగా యక్టీవ్ కేసులు ఉన్నాయి.