Operation Ganga: 22,500 మంది భారతీయులు సహా 18 దేశాల పౌరులను సురక్షితంగా తరలించిన భారత్

22,500 మంది భారతీయ పౌరులు సహా.. 18 దేశాల పౌరులను మానవతా దృక్పధంతో తరలించినట్లు తిరుమూర్తి పేర్కొన్నారు.

Un

Operation Ganga: యుక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ శ్రద్ధ ప్రశంసనీయమని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. యుక్రెయిన్ యుద్ధంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బ్రీఫింగ్‌లో గురువారం తిరుమూర్తి మాట్లాడారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులతో సహా భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి ‘ఆపరేషన్ గంగా’ కింద యుక్రెయిన్ నుండి ప్రత్యేక విమానాలను నడిపింది భారత ప్రభుత్వం. 22,500 మంది భారతీయ పౌరులు సహా.. 18 దేశాల పౌరులను మానవతా దృక్పధంతో తరలించినట్లు తిరుమూర్తి పేర్కొన్నారు.

Also Read: Russia – Ukraine war: మే 1 నాటికి తిరిగి రాకపోతే పదేళ్ళపాటు నిషేధం: విదేశీ కంపెనీలకు రష్యా హెచ్చరిక

యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి యుక్రెయిన్ లో క్రమంగా క్షీణిస్తున్న పరిస్థితులపై భారతదేశం తీవ్ర ఆందోళన చెందుతూనే ఉందని.. ఈ యుద్ధం అనేక మంది పౌరుల మరణానికి దారితీసిందని; వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని టీఎస్ తిరుమూర్తి తన ప్రసంగంలో పేర్కొన్నారు. యుద్ధం కారణంగా 30 లక్షల మందికి పైగా శరణార్థులు పొరుగు దేశాలకు తరలి వెళ్లారని తిరుమూర్తి తెలిపారు. ముఖ్యంగా యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో మానవీయ పరిస్థితులు మరింత దిగజారాయని టీఎస్ తిరుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Russia-Ukraine War:‘మీరు టిక్ టాక్ స్టార్ కదా’..యుక్రెయిన్ అధ్యక్షుడిని ప్రశ్నించిన యువతి..జెలెన్ స్కీ ఏమన్నారోతెలుసా?!

యుద్ధం కారణంగా యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు సహాయపడిన యుక్రెయిన్ అధికారులకు, పొరుగు దేశాల అధికారులకు ఈసందర్భంగా తిరుమూర్తి కృతఙ్ఞతలు తెలిపారు. అదే సమయంలో యుక్రెయిన్ లో తక్షణ కాల్పుల విరమణ ఆవశ్యకతపై భారత్ అభిప్రాయాన్ని తిరుమూర్తి భద్రతా మండలి సభలో పునరుద్ఘాటించారు. యుద్ధాన్ని ఆపాలంటే చర్చలు మరియు దౌత్యం యొక్క మార్గం తప్ప వేరే మార్గం లేదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను మరోసారి నొక్కిచెప్పారు తిరుమూర్తి. ఈ దిశగా రాబోయే రోజుల్లో భద్రతా మండలిలో, ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొనాన్రు. మరోవైపు మార్చి 1 నుండి మానవతా సహాయంలో భాగంగా భారత్ నుంచి యుక్రెయిన్ మరియు దాని పొరుగు దేశాలకు 90 టన్నులకు పైగా అత్యవసర సామాగ్రిని పంపిందని తిరుమూర్తి UNSCకి తెలిపారు.

Also read: America : చైనాకు అమెరికా స్ట్రాంగ్‌ వార్నింగ్.. ‘రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామాలు’