Google: అప్పటి వరకు 100 కోట్ల మంది భారతీయులు ఆన్‌లైన్‌లోకి..
ఇది అంత చిన్న విషయమేమీ కాదని, ఒకే దేశంలో ఇన్ని కోట్ల మంది ఆన్లైన్ వినియోగించడం సాంకేతికరంగంలో విప్లవాత్మకమైన మార్పని సంజయ్ గుప్త అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, ముఖ్యంగా భారతీయుల అవసరాలకు అనుగుణంగా మలిచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

India set to bring 1 billion citizens online by 2025: Google India head
Google: వచ్చే మూడేళ్లలో దేశంలో 100 మంది ఆన్లైన్ వినియోగిస్తారని గూగుల్ ఇండియా అధినేత సంజయ్ గుప్తా అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ‘గూగుల్ ఫర్ ఇండియా 2022’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 700 మిలియన్ల మంది (70 కోట్లు) భారతీయులు ఆన్లైన్ ఉపయోగిస్తున్నారని, కేవలం మూడేళ్లలో కొత్తగా 30 కోట్ల మంది కొత్తగా ఇందులోకి వస్తారని అన్నారు. దీంతో 2025 నాటికి దేశంలో ఒక బిలియన్ (100 కోట్లు) భారతీయులు ఆన్‌లైన్‌లోకి వచ్చినట్లు అవుతుందని ఆయన అన్నారు.
ఇది అంత చిన్న విషయమేమీ కాదని, ఒకే దేశంలో ఇన్ని కోట్ల మంది ఆన్లైన్ వినియోగించడం సాంకేతికరంగంలో విప్లవాత్మకమైన మార్పని సంజయ్ గుప్త అన్నారు. భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు గూగుల్ ప్రయత్నిస్తోందని, ముఖ్యంగా భారతీయుల అవసరాలకు అనుగుణంగా మలిచేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Kapil Sibal: కొలీజియంను సమర్ధించిన కపిల్ సిబాల్.. కోర్టులు కాషాయమయం కావొద్దంటూ హెచ్చరిక
ఇక కృత్రిమ మేధ(ఏఐ)కు సంబంధించిన అన్ని రకాల పరిశోధనల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్‌కు రూ.8.26 కోట్లు మంజూరు చేయనున్నట్లు ఇదే కార్యక్రమం నుంచి గూగుల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ గ్రాంట్ ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే, లాభాపేక్షలేని సంస్థ వాధ్వానీ ఏఐకు కూడా google.org రూ.8.26 కోట్లు మంజూరు చేయనుందని భారత గూగుల్ పరిశోధనల విభాగ డైరెక్టర్ మనీశ్ గుప్తా చెప్పారు.