ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు…రూ. 50వేల కోట్లు సిద్ధంగా ఉంచిన కేంద్రం

Modi govt has set aside ₹50,000 crore for vaccination కరోనా వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి చేస్తున్నారని, వ్యాక్సిన్ రెడీ అవగానే దాన్ని ప్రజలకు అందించేందుకు సిద్థంగా ఉన్నట్లు రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు కరోనా వ్యాకిన్ అందించడం కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా 50వేల కోట్ల రూపాయలనుపక్కనబెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.



దేశంలోని 130కోట్లమంది జనాభాకు వ్యాక్సిన్ అందించాలంటే ఒక్కొక్క వ్యక్తికి సుమారు 500వరకు ఖర్చు అవుతుందని మోడీ సర్కార్ అంచనావేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ పంపిణీ సమయంలో డబ్బుల కొరత రాకుండా కేంద్రం అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకు ప్రత్యేకంగా పక్కనబెట్టిన 50వేల కోట్ల రూపాయలు ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి కేటాయించబడినది మాత్రమే అని…తదుపరి ఫండ్స్ కు ఎలాంటి కొరత ఉండబోదని తెలిపారు.



కాగా,హిమాలయాల్లో నివసించే వాళ్లు మొదలుకొని..అండమాన్ దీవుల్లో నివసించే వాళ్ల వరకు దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ను సేకరించి అందించేందుకు భారత ప్రభుత్వానికి 80వేల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ల ఉత్పతిదారు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి అధార్ పూనావాలా అంచనావేశారు.



దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డెలివరీ చేయడం “అసాధారణమైన టాస్క్”గా ఉంటదని…అందువల్ల మనకు ప్రియారిటైజేషన్ ఫ్లాన్(ప్రాధాన్యత ప్రణాళిక) అవసరమని,ప్రారంభంలో అందరికీ కరోనా వ్యాక్సిన్ అందుకోలేరని బుధవారం చండీఘర్ లోని పోస్ట్ గ్రాడ్యేయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్ట్ లోని అసోసియేట్ ప్రొఫెసర్ మహేష్ దేవ్ నాని ఓ వెబినార్ సందర్భంగా తెలిపారు.