India still paying price for Nehru follies writes Rijiju
Nehru Follies: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో విలీనమై 75 ఏళ్లు దాటుతున్న సందర్భంగా ప్రధాన పార్టీల మధ్య రాజకీయం వివాదం తలెత్తింది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్‌ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. నెహ్రూని సమయం దొరికినప్పుడల్లా నెహ్రూని తప్పు పడుతూ పటేల్‌ని గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కశ్మీర్ అంశంలో దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ తప్పిదాలు ఇవేనంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొన్ని పాయింట్లను లేవనెత్తి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఓ వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో రిజిజు ఐదు తప్పిదాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. 1. భారత దేశంలో కశ్మీరు విలీనానికి 1947 జూలైలోనే మహారాజా హరి సింగ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. జవహర్లాల్ నెహ్రూ తన వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడం కోసమే ఇలా చేశారు. 2. అంతిమ విలీనాన్ని తాత్కాలికమైనదిగా ప్రకటించారు. 3. అధికరణ 51 ప్రకారం కాకుండా, అధికరణ 35 ప్రకారం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించారు. 4. ఏది ఏమైనా ఐక్య రాజ్య సమితి ఆదేశాలతో ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఓ బహిరంగ ప్రశ్ననే భావాన్ని వ్యాపించేందుకు అవకాశం ఇచ్చారు. 5. రాజ్యాంగంలో అధికరణ 370ని సృష్టించడం ద్వారా వేర్పాటువాద ఆలోచనా విధానాన్ని వ్యవస్థీకృతం చేశారు.
నెహ్రూ చేసిన ఈ తప్పిదాలు దేశాన్ని ఏడు దశాబ్దాలుగా వెంటాడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఇందులోనే కశ్మీర్ ఏడు దశాబ్దాలను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని గుర్తు చేస్తూ చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగిందని అన్నారు. నెహ్రూ చేసిన ఈ ఐదు తప్పులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2019 ఆగస్టు 5న తుడిచేశారన్నారు.
Indian Airfield: చైనాకు భారత్ కౌంటర్.. యుద్ధక్షేత్రంలో ఉపయోగపడేలా లదాఖ్‌లో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం