Indian Airfield: చైనాకు భారత్ కౌంటర్‌.. యుద్ధక్షేత్రంలో ఉపయోగపడేలా లదాఖ్‌లో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం

ఇండియా అభ్యంతరాల్ని పట్టించుకోకుండా సరిహద్దులో చైనా అనేక నిర్మాణాలు చేపడుతోంది. దీనికి బదులుగా ఇండియా కూడా నిర్మాణాలు ప్రారంభిస్తోంది. త్వరలో ఉత్తర లదాఖ్ ప్రాంతంలో ఒక ఎయిర్‌ఫీల్డ్ నిర్మించబోతుంది.

Indian Airfield: చైనాకు భారత్ కౌంటర్‌.. యుద్ధక్షేత్రంలో ఉపయోగపడేలా లదాఖ్‌లో ఎయిర్ ఫీల్డ్ నిర్మాణం

Indian Airfield: భారత్-చైనా సరిహద్దులో చైనా అనేక నిర్మాణాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య యుద్ధం అంటూ వస్తే ఈ నిర్మాణాల ద్వారా ఇండియాపై చైనా త్వరగా అటాక్ చేసే వీలుంటుంది. అయితే, చైనా చర్యలకు భారత్ కూడా ధీటుగా బదులిస్తోంది.

Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

చైనా బోర్డర్‌లో ఇండియా కూడా నిర్మాణం చేపడుతోంది. తాజాగా ఉత్తర లదాఖ్‌లో ఎయిర్‍ఫీల్డ్ (వైమానిక కేంద్రం) నిర్మాణం చేపట్టబోతుంది. న్యోమా ప్రాంతంలో ఈ నిర్మాణాన్ని చేపడుతోంది. ఇది చైనా సరిహద్దుకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం విశేషం. ఇక్కడ నిర్మించబోతున్న వైమానిక కేంద్రం ద్వారా యుద్ధ విమానాల్ని త్వరగా మోహరించే అవకాశం ఉంటుంది. అలాగే యుద్ధ సామగ్రిని తరలించడం, నిల్వ చేయడం వీలవుతుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే త్వరగా స్పందించేందుకు ఈ ఎయిర్‌ఫీల్డ్ ఉపయోగపడుతుంది. అలాగే సరిహద్దులోని ప్రాంతాలను కలుపుతూ, అక్కడికి యుద్ధ సామగ్రి, సైనికులకు కావాల్సిన ఆహారం వంటివి త్వరగా రవాణా చేసే ఉద్దేశంతో ‘బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్’ ద్వారా రోడ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Tamil Nadu: ప్రమాదంలో గాయపడి బాలిక మృతి.. అంత్యక్రియల తర్వాత సమాధిలోంచి బాలిక తల మాయం

దీని ద్వారా ఎయిర్‌ఫీల్డ్‌కు త్వరగా రవాణా వేగవంతమవుతుంది. ఇక.. తాజాగా నిర్మించబోతున్న న్యోమా అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ప్రాంతం కొంతకాలం నుంచి చాలా రద్దీగా ఉంది. చైనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడికి నిత్యం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు వంటివి తిరుగుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఈ పరిస్థితి తలెత్తింది.