Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు

Rohit Sharma: యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. అత్యధిక సిక్సర్లతో కొత్త రికార్డు

Rohit Sharma: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత క్రీడాకారుడిగా నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు యవరాజ్ సింగ్ పేరిట ఉండేది. ఆయన టీ 20 వరల్డ్ కప్‌లో మొత్తం 33 సిక్సర్లు నమోదు చేయగా, రోహిత్ శర్మ 34 సిక్సర్లు కొట్టాడు.

India vs Netherlands: నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం.. 56 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన మూడో సిక్సర్ ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో సిక్స్ కోసం ప్రయత్నించినప్పటికీ, అది సరైన టైమింగ్‌లో బ్యాట్‌కు తగలకపోవడం వల్ల బంతి ఫీల్డర్ చేతికి చిక్కింది. దీంతో రోహిత్ ఔటయ్యాడు. రోహిత్ శర్మకు సంబంధించిన మరో అంశం.. 2007 నుంచి జరిగిన ప్రతి టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడుతున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ ఒక్క టీ20 వరల్డ్ కప్ కూడా మిస్సవ్వకపోవడం గమనార్హం. అలాగే టీ20 వరల్డ్ కప్‌లు అన్నింట్లో కలిపి అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు రోహిత్.

Fire Haircut: ప్రాణాల మీదకు తెచ్చిన ‘ఫైర్ హెయిర్ కట్’.. తల ఎలా కాలిందో చూడండి.. వీడియో వైరల్

ఇప్పటివరకు అతడు ఆడిన 35 మ్యాచుల్లో కలిపి 904 పరుగులు సాధించాడు. ఇంతకుముందు నాలుగో స్థానంలో ఉన్న తిలకరత్నే దిల్షాన్‌ను రోహిత్ అధిగమించాడు. ఇక టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టింది వెస్టిండీస్ క్రీడాకారుడు క్రిస్ గేల్. అతడు అత్యధికంగా టీ20 వరల్డ్ కప్‌లు అన్నింట్లోనూ కలిపి, 63 సిక్స్‌లు సాధించాడు.

.