India vs Netherlands: నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం.. 56 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

టీ 20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.

India vs Netherlands: నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం.. 56 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

India vs Netherlands: టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 123 పరుగులు మత్రమే చేసింది. భారత జట్టు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.

Fire Haircut: ప్రాణాల మీదకు తెచ్చిన ‘ఫైర్ హెయిర్ కట్’.. తల ఎలా కాలిందో చూడండి.. వీడియో వైరల్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్.. ముగ్గురూ అర్ధ శతకాలు నమోదు చేశారు. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ ధాటిగా ఆడుతూ భారత స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. రోహిత్ శర్మ 39 బంతుల్లో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆయన బ్యాటింగ్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లోనే 51 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు.

‘Chief Twit’ Elon Musk: బాత్‌రూం సింక్‌తో ట్విటర్ ప్రధాన కార్యాలయంలోకి ఎలాన్ మస్క్.. వీడియో వైరల్

సూర్య కుమార్ యాదవ్ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దీంతో 20 ఓవరల్లో భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి, 179 పరుగులు సాధించింది. ఆ తర్వాత 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే ఔటవుతూ వచ్చారు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ విక్రమ్‌జిత్ సింగ్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. తర్వాత మరో ఓపెనర్ మ్యాక్స్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. ఈ జట్టులో అత్యధిక పరుగులు సాధించింది టిమ్ ప్రింగిల్. అతడు 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మిగతా వారంతా ఇంతకంటే తక్కువ పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసింది.

BCCI’s Big Announcement: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు

మరోవైపు బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు రాణించారు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అక్సర్ పటేల్, రవి చంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తీశారు. మొహమ్మద్ సమీ ఒక వికెట్ తీశాడు. దీంతో భారత జట్టు నెదర్లాండ్స్‌పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియ ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.