Pakistan: పాకిస్తాన్ ప్రధాని హెహబాజ్ షరీఫ్‌కు భారత్ ఆహ్వానం అందించబోతుందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఏడాది మేలో గోవాలో జరగబోయే ఎస్‌సీఓ (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) మీట్‌కు రావాల్సిందిగా పాక్ ప్రధానిని భారత్ ఆహ్వానించనున్నట్లు సమాచారం.
Republic Day parade: భారత గణతంత్ర వేడుకల్లో ఈజిప్ట్ ఆర్మీ.. తొలిసారి పరేడ్ నిర్వహించిన సైన్యం
పాక్ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి ఈ సదస్సుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోకు, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌కు సదస్సు నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రధానిని కూడా సదస్సు కోసం భారత్ ఆహ్వానించాలనుకుంటోంది. అయితే, ఇప్పటికే చైనా, పాక్‌లతో సంబంధాల విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్లు హాజరవుతారా.. లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పాకిస్తాన్‌కు సంబంధించి ఆ దేశ ప్రధాని లేదా విదేశాంగ మంత్రి.. ఎవరు హాజరైనా అది చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.
Republic Day Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే
కారణం.. 2011 తర్వాత నుంచి ఇప్పటివరకు పాక్ విదేశాంగ మంత్రి కానీ, ప్రధాని కానీ మన దేశంలో పర్యటించలేదు. చివరిగా 2011లో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బాని ఖర్ దేశంలో అధికారికంగా పర్యటించారు. పుల్వామా దాడి తర్వాత నుంచి ఇండియా-పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఇండియా నిర్వహించబోయే ఎస్‌సీఓ సదస్సుపై ఆసక్తి నెలకొంది. గోవాలో ఈ సదస్సు జరుగుతుంది. ఆసియాకు సంబంధించి తొమ్మిది సభ్య దేశాలు దీనికి హాజరవుతాయి. ఆయా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఈ సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది. అవి చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి.