India
India – UNSC : ఐక్యరాజ్య సమితి వేదికపై పాక్ వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తూ..ఐరాస వేదికను దుర్వినియోగం చేస్తోందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడి ఘటన ఇంకా ఎవరూ మరిచిపోలేదని..అందులో పాల్గొన్న ఉగ్రదాడి నిందితులకు పాక్ దేశం ఇంకా మద్దతు అందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, సహాయం చేయడం…మద్దతు ఇవ్వడం ఆ దేశ చరిత్ర అని వెల్లడించింది. సాయుధ పోరాటంలో పౌరుల రక్షణ అనే అంశంపై ఐరాసలో చర్చ జరిగింది.
Read More : Arunachal Youth : బోర్డర్‌లో మిస్సైన అరుణాచల్ యువకుడిని అప్పగిస్తానన్న చైనా..
ఈ సందర్భంగా భారత్..దాయాది దేశంపై విరుచుకపడింది. పౌరుల రక్షణపై చర్చిస్తున్నామని, కానీ..ఇప్పుడు పాక్ దేశానికి ఉగ్రవాదుల నుంచే ముప్పు వస్త్దోందని వెల్లడించింది. ఉగ్రవాదుల విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరి సభ్య దేశాలకు తెలుసని తెలిపింది. ఉగ్రవాదులకు ఆయుధాలు అందించే దేశంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఎద్దేవా చేసింది. అంతేగాకుండా ఐరాస నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాదులకు అతిథ్యం ఇస్తున్న దేశంగా దారుణమైన రికార్డు సొంతం చేస్తుందని దెప్పిపొడిచింది. జమ్మూ కశ్మీర్ అంశంపై కూడా స్పందించింది. పాక్ ఆక్రమించిన ప్రాంతాలు తమ భాగమేనని, వెంటనే వాటి నుంచి ఖాళీ చేయాలని తేల్చిచెప్పింది. పొరుగు దేశాలతో మెరుగైన సంబంధాలు భారత్ ఎప్పుడూ కోరుకుంటుందని తెలిపింది.