Indian Vaccine : ప్రపంచ దేశాలకు మరోసారి భారత వ్యాక్సిన్

ఇతర దేశాలకు మరోసారి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు భారత్ సిద్ధమైంది. భారత అవసరాలకు తగినంత వ్యాక్సిన్ ఉంచి.. మిగిలిన డోసులను వివిధ దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

Indian Vaccine : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న వేళ సంజీవని వంటి రెండు టీకాలను తయారు చేసింది భారత్.. ఆ తర్వాత వాటిని అనేక చిన్న దేశాలకు పంపిణి చేసింది. కోట్లాది డోసులను వివిధ దేశాలకు ఉచితంగా పంపిణీ చేసి మానవత్వం చాటుకుంది భారత్. ఇక ఈ సమయంలోనే దేశంలో కేసులు పెరుగుతుండటం.. టీకా వితరణ చాలా తక్కువగా ఉండటం.. ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంతో విదేశాలకు టీకా ఎగుమతులు నిలిపివేసి దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించింది.

Read More : Congress : కాంగ్రెస్ లోకి జిగ్నేష్ మేవానీ.. కన్నయ్య కుమార్

వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రస్తుతం దేశానికి సరిపడా టీకా ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన డోసులను ప్రపంచ దేశాలకు విరాళంగా ఇచ్చేనందుకు సిద్ధమైంది. కొవిడ్ వ్యాక్సిన్లను అక్టోబర్‌ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు, వ్యాక్సిన్ల విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. భారతీయులకు టీకా ఇవ్వడమే తొలి ప్రాధాన్యమన్న ఆయన.. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన డోసులను వ్యాక్సిన్‌ మైత్రి కార్యక్రమం, కొవాక్స్‌కు సరఫరా చేయనున్నట్టు తెలిపారు.

Read More : Home delivery: మద్యం హోం డెలివరీ.. తెలంగాణ ప్రజల అభిప్రాయం ఇదే.. 100శాతం హైదరాబాదీల సపోర్ట్!

ఇప్పటికే 100 దేశాలకు 6.6కోట్ల డోసులను విదేశాలకు సరఫరా చేసిన కేంద్రానికి.. వచ్చే మూడు నెలల్లో మొత్తం 100 కోట్లకుపైగా వ్యాక్సిన్‌ డోసులు అందనున్నాయి. ఇక దేశంలో 81 కోట్ల మందికి మొదటి డోసు టీకా వితరణ అయిపొయింది.

ట్రెండింగ్ వార్తలు