ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP)ఒప్పందంలో చేరకూడదని భారత్ నిర్ణయించింది. భారత్ మినహా మిగిలిన 15 ఆసియా, పసిఫిక్ దేశాలు ఆ భాగస్వామ్య కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌కు సమీపంలోని నాంతాబురిలో సోమవారం(నవంబర్-4,2019)జరిగిన ఆర్‌సీఈపీ సదస్సులో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ….RCEP ఒప్పందం యొక్క ప్రస్తుత రూపం ప్రాథమిక స్ఫూర్తిని,అంగీకరించిన మార్గదర్శక సూత్రాలను లేదా భారతదేశం యొక్క ఆందోళనను పూర్తిగా ప్రతిబింబించదని మోడీ అన్నారు.
అటువంటి నిర్ణయాలలో వాటా ఉన్న దేశంలోని రైతులు, వ్యాపారులు, నిపుణులు,పరిశ్రమలు, కార్మికులు,వినియోగదారులను ఉటంకిస్తూ…నేను RCEP ఒప్పందాన్ని భారతీయులందరి ప్రయోజనాలకు సంబంధించి కొలిచినప్పుడు, నాకు సానుకూల సమాధానం లభించలేదు. అందువల్ల నామనస్సాక్షి నన్ను RCEP లో చేరడానికి అనుమతించలేదని మోడీ తెలిపారు.