Army
భారత్ అంటే సహనం, ఓపిక, శాంతిమంత్రం. ఇంకా ఏదైనా జరగరానిది జరిగితే అంతర్జాతీయ చర్చలు. పదేళ్ల క్రితం వరకు భారత్‌ను ఇలానే చూసింది దాయాది పాకిస్థాన్. కానీ పదేళ్ల నుంచి బార్డర్‌లో గన్నులు ఎప్పుడూ లోడ్ చేసే ఉంటున్నాయ్. చీమ చిటుక్కుమన్నా.. ఏ మాత్రం డౌట్ వచ్చినా బుల్లెట్ దిగిపోతుందంతే.
పాకిస్థాన్ టార్గెట్ 10 మైళ్లు అయితే.. లెవెన్త్ మైలు టార్గెట్‌గా ఉగ్రవేటను స్పీడెక్కిస్తోంది. వేటాడటం మొదలు పెడితే తమ కంటే ఎవరూ బాగా వేటాడలేరని చేతల్లో చూపిస్తుంది భారత్. శాంతిని కోరుకోవడంతో పాటు అవసరమైతే ప్రత్యర్థుల తిక్క కుదర్చడం కూడా వస్తుందని లెక్కతో సహా అప్పగించేస్తుంది.
టెర్రర్ ఆపరేషన్‌లో కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది ఇండియన్ ఆర్మీ. దొంగదారిలో వచ్చి దాడి చేశాం.. దొడ్డిదారిలో జంప్ అయ్యామని ఖుష్ అయ్యే ఉగ్రవాదుల ఆటలు ఇక చెల్లవు.. శత్రువు ఎక్కడున్నా.. ఇంటికెళ్లి కొట్టినట్లు.. పక్కోడికి కూడా అనుమానం రాకుండా పనికానిచ్చి తిరిగి వచ్చేస్తున్నాయి మనబలగాలు.. ఉగ్రవాదులకు ఇండియాలో ఉంటేనే భయం కాదు.. వారు సేఫ్ అనుకుని..తమ అడ్డాలో ఎవడు అడుగుపెట్టలేడనుకున్న చోటునే ప్రాణభయంతో తిరుగుతున్నారంటే.. భారత్ టెర్రర్ ఆపరేషన్ ఏ లెవల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పట్లో జైలులో పెట్టి కోట్ల ఖర్చుతో భద్రంగా
టెర్రర్ ఆపరేషన్ విషయంలో.. ఇన్నాళ్లూ మన కేంద్ర ప్రభుత్వాల మీద విమర్శలు ఉండేవి. మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఎడాపెడా కాల్పులు జరిపి వందల మందిని చంపేసి పట్టుబడినా సరే, జైలులో పెట్టి కోట్ల ఖర్చుతో భద్రంగా కాపాడుతాం. పార్లమెంటు మీద దాడి చేసిన నిందితుడైనా సరే, సుప్రీం తలుపులు అర్ధరాత్రయినా సరే తెరిచి విచారిస్తాం.
పాకిస్థాన్ నుంచి వందలాది ఉగ్రవాదులు తరలివచ్చి విధ్వంసాలు, ఊచకోతలకు పాల్పడుతున్నా మనమేమీ చేయలేమా అనే అసంతృప్తి ఉండేది. ఇప్పుడది మారింది. ఏదైనా ఉగ్రదాడి జరిగితే గంటల్లోనే రియాక్షన్ ఉంటుంది. లేదు అంతు చిక్కకుండా ఉగ్రమూకలు తప్పించుకుని వెళ్లారంటే.. ఇండియన్ ఆర్మీకి దొరికి చచ్చే వరకు.. భయంతో చస్తూ బతకాల్సిందే.
నింగి, నేల, సముద్రం.. ఏ రూట్లో వచ్చినా .. శత్రవు అంతు చూస్తున్నాయి భారత బలగాలు. సరిహద్దులు దాటాం.. దాడి చేసి రోజులు అయిపోయింది సేఫ్ అని దీమాలో ఉంటున్న ఉగ్రమూకలను.. యముడిలా వెంటాడి.. గన్‌ను భారత్ కంటే బాగా ఎవరూ వాడలేరని చూపిస్తోంది.
దేశంలోకి చొరబడి శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది ప్రయత్నించినా.. తగిన సమాధానం ఇస్తుంది భారత్. ఒకవేళ వారు పాకిస్థాన్‌కు పారిపోయినా వదిలే ముచ్చటే లేదంటోంది. అక్కడికి వెళ్లి మరీ మటాష్ చేసేస్తోంది. ఈ ఏడాది కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఖతం చేసి వెళ్లిపోయారు. అయితే ఇది భారత ఏజెంట్ల పనేనని కెనడా ఆరోపిస్తుంది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది భారత్.
ది గార్డియన్ పత్రిక కథనం
పాక్‌లో టెర్రరిస్టుల మరణాల వెనుక ఇండియా హస్తం ఉందంటూ ది గార్డియన్ పత్రిక కథనం రాసింది. పుల్వామా దాడి అనంతరం నుంచి భారత దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వారిని లక్ష్యంగా చేసుకుందని చెప్పింది. ‘రా’ దాదాపు 20 మందిని హత్య చేసి ఉంటుందని తెలిపింది. ఇరు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చెబుతున్నామని పేర్కొంది.
తప్పుడు సమాచారం
అది పూర్తిగా తప్పుడు సమాచారమని భారత్ కొట్టేపడేసింది. 2019 పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత.. పాకిస్తాన్, భారత్ మధ్య అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కూడా తెగిపోయాయి. కశ్మీర్‌లో పాక్ టెర్రర్ యాక్టివిటీ పెరిగిపోయింది. పూంచ్, అనంత్ నాగ్ సెక్టార్లలో ఉగ్రవాదుల కవ్వింపులు ఎక్కువయ్యాయి.
అయితే కొన్ని టెర్రర్ అటాక్స్‌లో ఉగ్రవాదులు దొరుకుతున్నారు. మరికొన్ని ఘటనల్లో మాత్రం దాడి చేసి.. తప్పించుకుంటున్నారు. దీంతో సీక్రెట్ ఆపరేషన్ చేస్తోంది భారత్. తప్పించుకుని వెళ్లి ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. గుట్టు చప్పుడు కాకుండా ఖతం కార్యక్రమం పూర్తి చేస్తుంది రీసెర్చ్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్.
మీ బ్యాంక్ అకౌంట్‌లో ఎడాపెడా డబ్బులు జమ చేస్తూ, విత్‌డ్రా చేస్తూ ఉన్నారా?