Karnataka Hijab : కర్ణాటక హిజాబ్ వివాదం..ముస్లిం మహిళలను చిన్న చూపు చూడొద్దన్న మలాలా

కర్ణాటక హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ బాలల హక్కుల నేత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. ముస్లిం మహిళలను చిన్న చూపు చూడొద్దని..ఇది భయానకమైన చర్య అని అన్నారు మలాలా.

Malala Yousafzai On Karnataka Hijab Row : కర్ణాటకలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ముస్లిం యువతులు ముఖానికి ముఖానికి హిజాబ్ (ముసుటు) ధరించ రావటాన్ని వ్యతిరేకిస్తున్న విషయం అంతకంతకు ముదురుతోంది. అటు విద్యాసంస్థలు ఏమాత్రం తగ్గటంలేదు. ముసుగు తీసి..యూనిఫామ్ తోనే వస్తేనే లోపలికి రానిస్తామంటున్నారు.లోపలికి రానిచ్చినా అందరితో కలిసి కూర్చోకుండా విడిగా కూర్చోపెడుతున్నా ముస్లిం విద్యార్థినులను.

Also read : Karnataka : డ్రెస్ కోడ్ వార్.. కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కండువా

ఈ వివాదంపై బాలల హక్కుల కార్యకర్త, పాకిస్థాన్ కు చెందిన మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు. హిజాబ్ తో విద్యార్థినులను అనుమతించకపోవడం భయానక చర్య అని మలాలా ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలిపారు. ముసుగు ముస్లిం మహిళల సంప్రదాయమని..ముసుగు ధరించే వారిని చిన్నచూపు చూడవద్దని సూచించారు.మలాలా యూసఫ్ జాయ్ తన ట్విట్టర్ పేజీలో దీనిపై స్పందించారు. ‘‘బాలికలను హిజాబ్ తో స్కూల్ కు అనుమతించకపోవడం భయానకం. స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతోంది. ముస్లిం మహిళలను చిన్న చూపు చూడడాన్ని భారత నాయకులు ఆపివేయాలి’’ అని మలాలా ట్వీట్ చేసారు.

Also read : Karnataka Hijab Row: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినీలను తరగతిలోకి అనుమతించిన కళాశాల

ఉడిపి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కాలేజీలో ఆరుగురు విద్యార్థినులను హిజాబ్ తో అనుమతించకపోవటం వారికి నిరసనగా కొంతమంది విద్యార్ధులు కాషాయ రంగు తలపాగాలు ధరించి రావటం కాస్తా వివాదంగా మారింది. ఈ అంశం కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాలకే కాకుండా..మధ్య ప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలకూ వ్యాపించింది. ఆయా ప్రభుత్వ నిర్ణయాన్ని ముస్లిం విద్యార్థినులు వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలకు మూడు రోజుల సెలవులను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు