Karnataka Hijab Row: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినీలను తరగతిలోకి అనుమతించిన కళాశాల

గత డిసెంబర్ లో మొదలైన బురఖా వివాదంపై హోంశాఖ వర్గాలు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Karnataka Hijab Row: బురఖా ధరించి వచ్చిన విద్యార్థినీలను తరగతిలోకి అనుమతించిన కళాశాల

Students

Karnataka Hijab Row: కర్ణాటక రాష్టంలో ముస్లిం విద్యార్థినిలు బురఖా ధరించి విద్యాసంస్థలకు రావడం పై చెలరేగిన దుమారం.. ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. ముస్లిం విద్యార్థినిలు బురఖా ధరించి రావడంపై గత రెండు నెలలుగా దక్షిణ కన్నడ జిల్లాల్లో మొదలైన నిరసనలు క్రమంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పాకీ, చివరకు రాజకీయ రంగు పులుముకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. విద్యార్థుల యూనిఫార్మ్ విషయంలో విద్యాసంస్థలకు.. కఠిన నియమాలు విధిస్తు సూచనలు చేసింది. విద్యార్థులందరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఆయా విద్యాసంస్థలు నిర్ణయించిన యూనిఫార్మ్ ను ధరించే పాఠశాలలకు రావాలని కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పష్టం చేశారు. యూనిఫామ్ ధరించని పక్షంలో.. మతపరమైన దుస్తులు మినహా.. విద్యార్థులు తమకు ఇష్టమైన బట్టలు ధరించవచ్చని నగేష్ సూచించారు. విద్యార్థులు రాజకీయ క్రీడలకు బలికావొద్దంటూ బీజేపీ నేతలు కోరుతున్నారు.

Also read; Gadwal Bidda: సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన “గద్వాల్ రెడ్డి బిడ్డ” అనారోగ్యంతో మృతి

ఇదిలా ఉంటే.. అసలు ఈ సమస్య మూలాలైన ఉడిపి జిల్లా కుందాపూర్లో సోమవారం బురఖా ధరించి గవర్నమెంట్ పీయూ కళాశాలకు వచ్చిన ముస్లిం విద్యార్థినీలను.. యాజమాన్యం తరగతిలోకి అనుమతిచ్చింది. అయితే అందరి విద్యార్థులతో కలిసి కాకుండా.. ప్రత్యేక తరగతి గదిలో మాత్రమే కూర్చోవాలని షరతు విధించింది. దీంతో ప్రత్యేక తరగతి గది అయినా..బురఖా ధరించి వచ్చే పాఠాలు వింటామంటూ విద్యార్థినిలు లోనికి ప్రవేశించారు. వారు మిగతా తరగతుల వారితో కలుసుకోకూడదంటూ పాఠశాలా యాజమాన్యం హెచ్చరించింది. మరోవైపు సోమవారం కుందాపూర్ కళాశాల వద్ద.. చేతిలో కత్తితో కొందరు వ్యక్తులు సంచరించడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు పరారయ్యారు.

Also read: vuyyuru Crime: ఉయ్యూరులో అందరూ చూస్తుండగానే వ్యక్తి పై హత్యాయత్నం

కాగా గత డిసెంబర్ లో మొదలైన బురఖా వివాదంపై హోంశాఖ వర్గాలు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉడిపి జిల్లాలో కొందరు మతోన్మాద శక్తులు ముస్లిం విద్యార్థినీలతో ఈ పనిచేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉడిపి జిల్లాలో మొదట ఈ వివాదానికి కారణమైన పాఠశాలలో మొత్తం 92 మంది ముస్లిం విద్యార్థినిలు ఉండగా.. వారిని బురఖా ధరించమంటూ ఆయా మతాల వారు నూరిపోశారని.. అయితే తెలివిగల విద్యార్థినిలు మతోన్మాద శక్తుల మాటలు పెడచెవిన పెట్టి.. యూనిఫార్మ్ ధరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆయా శక్తులకు లోబడిన కొందరు విద్యార్థినిలు మాత్రం బురఖా ధరించి తరగతులకు వెళ్లారని.. దీంతో ఎప్పుడూ లేనిదే ఇలా బురఖాలు ఎందుకు ధరించారంటూ మిగతా విద్యార్థులు ప్రశ్నించడంతో ఈ వివాదం చెలరేగినట్లు కర్ణాటక హోంశాఖ వర్గాల దర్యాప్తు తేలింది.