Gadwal Bidda: సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన “గద్వాల్ రెడ్డి బిడ్డ” అనారోగ్యంతో మృతి

"అంతేకదా సార్.. అది కూడా కరెక్టే కదా సార్" అంటూ ఆ బాలుడు చెప్పిన మాటలు అందిరికి నవ్వు తెప్పించాయి. ఆస్తమాతో బాధపడుతున్న ఆ బాలుడు ఆదివారం మృతి చెందాడు

Gadwal Bidda: సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన “గద్వాల్ రెడ్డి బిడ్డ” అనారోగ్యంతో మృతి

Social

Gadwal Bidda: సోషల్ మీడియా యుగంలో కొందరు తాము చేసే పనులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతుంటారు. తాము చేసే ఘనకార్యాలను టిక్ టాక్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ వంటి వాటిలో పోస్ట్ చేస్తుంటారు. వాటిలో కొన్ని పాజిటివ్ గా ప్రజలకు చేరుకుంటే.. మరికొన్ని నెగటివ్ గా ప్రజలకు అర్ధం అవుతాయి. అలా సోషల్ మీడియాలో తెలిసీ తెలియని వయసులో ఓ తెలుగు బాలుడు చేసిన వ్యాఖ్యలు అతణ్ణి ఫేమస్ చేసాయి. అయితే అంతలోనే ఆ బాలుడు మృతి చెందడం దిగ్బ్రాంతికి గురిచేస్తుంది.

Also read: vuyyuru Crime: ఉయ్యూరులో అందరూ చూస్తుండగానే వ్యక్తి పై హత్యాయత్నం

సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజెన్ల దృష్టిలో పడ్డ ‘గద్వాల రెడ్డి బిడ్డ’ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి మృతి చెందాడు. జోగులాంబా గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామానికి చెందిన మల్లికార్జున రెడ్డి నాలుగేళ్ళ క్రితం.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన.. ఆ వీడియో వైరల్ గా మారి.. మల్లికార్జున్ సంచలనంగా మారాడు. దీని తరువాత పలువురు దళితులపైనా ఈ బాలుడు నోరుపారేసుకున్నాడు.

Also read: Lata Mangeshkar : లతా మంగేష్కర్ అంత్యక్రియలు

దీంతో దళిత సంఘాలు, స్థానిక నేతలు కొందరు ఆ బాలుడిని ఇంటికి వెళ్లి హెచ్చరించారు. “అంతేకదా సార్.. అది కూడా కరెక్టే కదా సార్” అంటూ ఆ బాలుడు చెప్పిన మాటలు అందిరికి నవ్వు తెప్పించాయి. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ పేజీలకు ముఖచిత్రంగా మారిపోయాడు మల్లికార్జున్. అయితే గత కొన్ని రోజులుగా ఆస్తమాతో బాధపడుతున్న ఆ బాలుడు ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రియాక్ట్ అవుతూ..బాలుడు మృతికి “RIP” ట్యాగ్ చేస్తున్నారు.

Also read: SAGY List: ఆదర్శ గ్రామాల జాబితాలో 10లో 7 తెలంగాణవే, ఏఏ గ్రామాలంటే!