Karnataka : డ్రెస్ కోడ్ వార్.. కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కండువా

విద్యార్థుల మధ్య సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా.. విపక్షాల మాట వేరేలా ఉంది.

Karnataka : డ్రెస్ కోడ్ వార్.. కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కండువా

Hizab

Hijab Controversy : కర్ణాటకలో హిజాబ్‌ వర్సెస్‌ కండువా వివాదం కొనసాగుతోంది. కర్ణాటక సర్కార్‌ ఉత్తర్వులను పట్టించుకోడంలేదు స్టూడెంట్స్. సంప్రదాయాన్ని పాటిస్తున్న ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్‌ ధరించే కాలేజ్‌లకు వెళ్తున్నారు. అటు కాషాయపు కండువాలు ధరించి కాలేజ్‌కు వెళ్తున్నారు హిందూ విద్యార్థులు. మరోవైపు డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనంటున్న కాలేజ్‌ యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను నోటీసు బోర్డుల్లో పెట్టింది.

Read More : Gadwal Bidda: సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన “గద్వాల్ రెడ్డి బిడ్డ” అనారోగ్యంతో మృతి

కర్ణాటకలో హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను కాలేజ్‌ గేటు వద్దే అడ్డుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్‌ కోడ్‌ ప్రకారం తరగతి గదుల్లోకి హిజాబ్‌ లేదా కాషాయపు కండువాకు అనుమతి లేదని కాలేజ్‌ యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నారు. అయితే కొంత మంది విద్యార్థులు ఇవేమి పట్టనట్లు ఉంటున్నారు. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం కూడా ముస్లిం విద్యార్థునులు హిజాబ్‌తోనే కాలేజ్‌లకు వచ్చారు. అటు హిందూ విద్యార్థులూ కాషాయపు కండువాలతోనే వచ్చారు. ఇక తమను హిజాబ్‌తో తరగతులకు అనుమతించాలని విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. హైకోర్టు ఈవివాదంపై తీర్పు వెలువరించేవరకూ అన్ని విద్యా సంస్థల్లో యూనిఫామ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తోంది.

Read More : Road Accident : పెళ్లికి వెళ్లి వస్తుండగా పేలిన కారు టైర్లు..ఇద్దరు మృతి

విద్యార్థుల మధ్య సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ప్రభుత్వం ఓవైపు చెబుతుండగా.. విపక్షాల మాట వేరేలా ఉంది. సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో దుస్తులను ధరించకూడదంటూ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు ప్రభుత్వం. కొన్ని విద్యాసంస్థల్లో స్టూడెంట్స్‌ తమ మత సంప్రదాయలు పాటించడంతో సమానత్వం, ఐక్యత దెబ్బతింటున్నట్లు తాము గుర్తించామని కర్ణాటక విద్యాశాఖ చెబతోంది. విద్యార్థులు అధికారులు ఎంపిక చేసిన డ్రెస్ కోడ్‌నే అనుసరించాలని స్పష్టం చేసింది.