Indian Military in 2021: 2021లో భారత మిలిటరీలో జరిగిన 11 ప్రమాదాలు

త్రిదళాధిపతి బిపిన్ రావత్ మృతి సహా భారత మిలిటరీలో జరిగిన పలు ప్రమాదాలు 2021లో తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చాయి.

Indian Military in 2021: త్రిదళాధిపతి బిపిన్ రావత్ మృతి సహా భారత మిలిటరీలో జరిగిన పలు ప్రమాదాలు 2021లో తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చాయి. భారత మిలిటరీలోని సైన్యం, వాయుసేనకు చెందిన 11 విహంగ ప్రమాదాల్లో మొత్తం 22 మంది సైనికులు అసువులు బాసారు. 2020లో కంటే దాదాపు రెట్టింపు ప్రమాదాలు 2021లో సంభవించాయి. ఇండియన్ ఆర్మీలో భాగంగా ఉన్న ” ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్”కు చెందిన మూడు విమానాలు కుప్పకూలగా, ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాఫ్టర్లు, విమానాలు కుప్పకూలాయి. దేశ రక్షణలో ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులను కబళించిన ఆ ప్రమాదాల తాలూకు వివరాలు.

2021లో భారత మిలిటరీలో జరిగిన 11 ప్రమాదాల్లో 5 ప్రమాదాలు MiG -21 Bison కుప్పకూలడమే. మొదటి విమాన ప్రమాదం MiG -21 Bison కుప్పకూలడం. జనవరి 5న రాజస్థాన్ లోని సూరత్ గఢ్ జరిగిన ఈప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. మార్చి 17న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన మరో ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ ఆశీష్ గుప్తా మృతి చెందారు. మే 21న పంజాబ్ లోని మోగా జిల్లాలో జరిగిన ప్రమాదంలో స్క్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మృతి చెందారు. ఆగష్టు 25న రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన మరో ప్రమాదంలో పైలట్ గాయాలతో బయటపడ్డాడు. ఇక తాజాగా డిసెంబర్ 24న రాజస్థాన్ లోని జైసల్మేర్ సమీపంలో జరిగిన MiG -21 ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మృతి చెందారు.

Also Read: Tiger Population 2021: భారత్ లో ఆందోళనకర స్థాయిలో పెద్ద పులుల మృత్యువాత

ఆర్మీ ఏవియేషన్ కు చెందిన రెండు రుద్రా హెలికాప్టర్ ప్రమాదాలు ముగ్గురు పైలట్ లను బలిగొన్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలో ఆగష్టు మొదటి వారంలో జరిగిన ఘోర ప్రమాదంలో కెప్టెన్ జయంత్ జోషి మరియు సహచర పైలట్ మృతి చెందారు. కథువా జిల్లాలోనే జనవరిలో జరిగిన మరో రుద్రా హెలికాప్టర్ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 21న మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో Mirage 2000 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈఘటనలో పైలట్ గాయాలతో బయటపడ్డాడు. జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో జరిగిన Cheetah హెలికాప్టర్ ప్రమాదంలో మేజర్ రోహిత్ కుమార్ మరియు మేజర్ అనూజ్ రాజ్‌పుత్ మృతి చెందారు. ఇక ఈఏడాది జరిగిన అతిపెద్ద మిలిటరీ ప్రమాదం MI 17 V5 కుప్పకూలడం. డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ లో జరిగిన MI 17 V5 హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ ధళాధిపతి బిపిన్ రావత్ సహా 14 మంది మృతి చెందారు. వీరిలో ఐదుగురు సైన్యానికి చెందిన వారు కాగా మిగిలిన 9 మంది పౌరులు ఉన్నారు. నవంబర్ 18న అరుణాచల్ ప్రదేశ్ లోని రొచ్చంలో జరిగిన మరో MI 17 V5 ప్రమాదంలో ఒకరు గాయపడగ, నలుగురు సురక్షితంగా బయటపడ్డారు

Also Read: Movie Budgets Hike: తడిసిమోపెడవుతున్న బడ్జెట్.. హీరోల రెమ్యునరేషనే కారణం!

ట్రెండింగ్ వార్తలు