COVID-19 vaccine capsule: కొవిడ్ వ్యాక్సిన్‌ ట్యాబ్లెట్లు రెడీ చేస్తున్న ఇండియన్ ఫార్మా కంపెనీ

ఇంజెక్షన్లు, సూదులకు భయపడేవాళ్లకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో COVID-19 వ్యాక్సిన్ అనేది క్యాప్సుల్ రూపంలో మార్కెట్లోకి రాబోతుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మాసూటికల్ కంపెనీలు శ్రమిస్తుండగా..

COVID-19 vaccine capsule: ఇంజెక్షన్లు, సూదులకు భయపడేవాళ్లకు గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో COVID-19 వ్యాక్సిన్ అనేది క్యాప్సుల్ రూపంలో మార్కెట్లోకి రాబోతుంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫార్మాసూటికల్ కంపెనీలు శ్రమిస్తుండగా.. వాటిలో ఇండియాకు చెందిన ప్రేమాస్ బయోటెక్ కూడా ఉంది.

అమెరికాకు చెందిన ఒరామ్‌డ్ ఫార్మాసూటికల్స్ తాము నోటితో తీసుకోగల కొవిడ్ మందును తయారుచేస్తున్నట్లు మార్చి 19న ప్రకటించారు. ఈ పద్ధతిలో సింగిల్ డోసేజ్ లోనే వ్యాక్సిన్ తీసుకునేలా డెవలప్ చేస్తున్నామని అన్నారు.

వ్యాక్సిన్ పైలట్ స్టడీలో భాగంగా.. Oravax COVID-19 capsule సింగిల్ డోస్ జంతువులపై ప్రయోగించగా ఎఫెక్టివ్ గానూ.. సమర్థవంతంగానూ పనిచేసింది. యాంటీబాడీలను ప్రొడ్యూస్ చేయడంలో, న్యూట్రలైజ్ చేయడంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఇవి గ్యాస్ట్రోఇంటెస్టినల్, శ్వాస వ్యవస్థలకు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయి.

ప్రొటీన ఆధారిత ఈ వ్యాక్సిన్ SAARS CoV2 వైరస్ మూడు భాగాలపై ప్రొటెక్షన్ ఇస్తుంది. స్పైక్ ఎస్, మెంబ్రేన్ ఎమ్, ఎన్వలప్ ఈ లను టార్గెట్ చేసి కాపాడుతుంది. న్యూక్లియోక్యాప్సిడ్ ఎన్ యాంటీజెన్ కు ప్రొటెక్షన్ ఇవ్వలేదు.

ప్రస్తుత అబ్జర్వేషన్లలో ఓరల్ వ్యాక్సిన్ జంతువులపై ప్రయోగించాం.. 2021 సెకండ్ క్వార్టర్ లో క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. భారత్ బయోటెక్ కొవిడ్ వ్యాక్సిన్ ను ఇప్పటికే నాజల్ మార్గంగా అందిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కోన్సిన్ ద్వారా ఈ సర్వీస్ ఇవ్వగలుగుతుంది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు