హౌడీ- మోడీ : అమెరికా షెడ్యూల్ వివరాలు

  • Publish Date - September 21, 2019 / 01:23 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. హ్యూస్టన్, న్యూయార్క్‌లో పర్యటించే ప్రధాని… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం హౌడీ- మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సదస్సులో 50వేల మంది ఎన్ఆర్ఐలు‌ పాల్గొంటుండగా… అమెరికా అధినేత ట్రంప్‌ కూడా హాజరవుతారు. మరోవైపు… ట్రంప్‌తో మోదీ ఈ ఏడాది కాలంలో మూడోసారి భేటీ అవుతారు. 22న జరిగే హౌడీ- మోదీ ఎన్నారైల సదస్సులో ట్రంప్… ప్రవాస భారతీయులను ఉద్దేశించి… కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. 

> సెప్టెంబర్ 21 (శనివారం)
హ్యూస్టన్ చేరుకోగానే…తొలుత 16 చమురు కంపెనీల CEOలతో రౌండ్ టేబుల్ సమావేశం. పెట్టుబడులను ఆకర్షించండం.
> సెప్టెంబర్ 22 (ఆదివారం)
హ్యూస్టన్‌లో జరిగే హౌడీ- మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రవాస భారతీయులతో ముచ్చటించడం.
> సెప్టెంబర్ 23 (సోమవారం)
న్యూయార్క్‌లో వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గుబెరస్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో మోడీ స్పీచ్. గుటెరెస్ ఆధ్వర్యంలో జరిగే మరో సదస్సు ఆయుష్మాన్ భారత్ పథకం విశేషాలపై ప్రసంగం.
గుబెరస్‌తో పాటు జోర్దాన్ రాజు, ఫ్రాన్స్ అధ్యక్షుడు, న్యూజిలాండ్ ప్రధానిల సంయుక్త ఆధ్వర్యంలో ఉగ్రవాదులకు వ్యూహాత్మక సమాధానాలు అనే అంశంపై జరిగే సదస్సులో మోడీ ప్రసంగం. 
> సెప్టెంబర్ 24 (మంగళవారం)
న్యూయార్క్ నగరంలో మోదీ – ట్రంప్‌ల భేటీ. 
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఐరాసాలో ప్రస్తుత పరిస్థితులకు గాంధీ అవశ్యకత అనే అంశంపై జరిగే సదస్సులో మోడీ స్పీచ్. 
ఐక్యరాజ్య సమితి 50 కిలోవాట్‌ల సామర్థ్యం గల గాంధీ సౌర విద్యుత్ పార్కను బహుమతిగా ఇవ్వనున్నారు. 
స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ ప్రాంగంలో 150 మొక్కలతో ఏర్పాటు చేసిన గాంధీ శాంతి వనం రిమోట్ కంట్రోల్‌తో ప్రారంభం. 
స్వచ్చ భారత్ కార్యక్రమం చేపట్టినందుకు బిల్ – మెలిండా గేట్స్ ఫౌండేషన్ బహుకరించే గ్లోబల్ గోల్ కీపర్స్ గోల్ పురస్కారం స్వీకరణ.
ఇండియా – ఫసిఫిక్ దీవుల నాయకుల సమావేశంలో మోడీ స్పీచ్. 
> సెప్టెంబర్ 25 (బుధవారం)
బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సదస్సులో కీలక ప్రసంగం, 
45 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మీటింగ్. 
14 కరేబీయన్ దేశాలతో జరిగే ఇండియా కరికోం సదస్సుకు సహా అధ్యక్షత. ప్రకృతి వైపరీత్యాల నివారణకు ఆ దేశాలకు సహాయం అందించే విషయంపై చర్చలు.
> సెప్టెంబర్ 26 (గురువారం)
పలు వర్గాలతో ద్వైపాక్షిక సంప్రదింపులు. 
> సెప్టెంబర్ 27 (శుకవారం)
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మోడీ ప్రసంగం.