Ganpati Special Trains :రైలు ప్రయాణికులకు శుభవార్త… 312 గణపతి ప్రత్యేక రైళ్లు

దేశంలో రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుక్రవారం శుభవార్త వెల్లడించింది. గణపతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 312 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది....

Ganpati Special Trains

Ganpati Special Trains : దేశంలో రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుక్రవారం శుభవార్త వెల్లడించింది. గణపతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 312 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. (Ganpati Special Trains) భారతీయ రైల్వేలు వినాయక పండుగ సందర్భంగా పెరిగిన ప్రయాణికులకు సౌకర్యం కల్పించడానికి గణపతి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.

PM Modi : నలభై ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన మొదటి ప్రధాని మోదీ

పండుగ రద్దీని ఎదుర్కొనేందుకు భారతీయ రైల్వేలు సెంట్రల్ రైల్వే మరియు పశ్చిమ రైల్వే శాఖలు 312 గణపతి ప్రత్యేక రైళ్లను నడపనున్నాయి. (Indian Railways Announces ) ప్రత్యేక రైళ్లలో 1.04 లక్షల మంది రిజర్వ్‌డ్ ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేయనున్నాయి. పశ్చిమ రైల్వే 55 గణపతి ప్రత్యేక రైళ్లను నడపనుంది. సెంట్రల్ రైల్వే 257 రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లలో ఎక్కువ భాగం మహారాష్ట్రలోని వివిధ నగరాల నుంచి ముంబయి నగరానికి కనెక్టివిటీని అందిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు