గుడ్ న్యూస్ : రైలు టికెట్లపై 50శాతం రాయితీ

భారతీయ రైల్వే.. యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ''ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రైల్వే ఈ ఆఫర్

  • Publish Date - December 19, 2019 / 04:11 PM IST

భారతీయ రైల్వే.. యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ”ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రైల్వే ఈ ఆఫర్

భారతీయ రైల్వే.. యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రైలు టికెట్లపై 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ”ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం రైల్వే ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు… ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రయాణించే యువతీ యువకులకు రైలు టికెట్ల బేసిక్ ధరపై 50శాతం రాయితీ ఇస్తారు. అయితే నెలకు రూ.5వేల కన్నా తక్కువ సంపాదిస్తున్నవారికి మాత్రమే ఈ కన్ సెషన్ వర్తిస్తుంది. 

సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్ రైలు టికెట్లపై ఈ రాయితీని ఉపయోగించుకోవచ్చు. అది కూడా సాధారణ రైలు సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక కోచ్‌లకు ఈ రాయితీ వర్తించదు. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు 300 కిలోమీటర్ల పైన సెకండ్, స్లీపర్ క్లాస్ మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో ప్రయాణించేవారికి రాయితీతో టికెట్లను ఆఫర్ చేయనుంది భారతీయ రైల్వే. రాయితీ కేవలం బేసిక్ ఫేర్‌పైన మాత్రమే. రిజర్వేషన్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు యథాతథంగా ఉంటాయని తెలిపింది.

* ఆయా రాష్ట్రాలకు చెందిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సెక్రెటరీ నుంచి సూచించిన ఫార్మాట్‌లో సర్టిఫికెట్ పొందినవారు మాత్రమే రాయితీపై టికెట్లను పొందొచ్చు. 
* ఆ సర్టిఫికెట్‌ను చీఫ్ కమర్షియల్ మేనేజర్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ లాంటి రైల్వే అధికారులకు సమర్పించాలి. 
* ఆ తర్వాత రాయితీ కల్పిస్తూ ఆదేశాలు వస్తాయి. 
* ఆ తర్వాత రైళ్లల్లో రాయితీపై టికెట్లు తీసుకోవచ్చు. 
* అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, చట్టబద్ధమైన సంస్థలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల రవాణా ఖర్చులతో ప్రయాణించేవారికి ఈ రాయితీ వర్తించదు.
* ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకు, వారి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రైల్వే ఈ ఆఫర్ ప్రకటించింది.