Indian Railways: బిగ్ న్యూస్! 750 రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ

మీరు ఏదైనా రైలులో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా? రిజర్వేషన్ చేయించుకున్నారా? అయితే కచ్చితంగా ఓసారి చెక్ చేసుకోండి.

Indian Railways Introduces New Rules For Online Ticket Booking

Indian Railways: మీరు ఏదైనా రైలులో ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా? రిజర్వేషన్ చేయించుకున్నారా? అయితే కచ్చితంగా ఓసారి చెక్ చేసుకోండి. రైల్వేశాఖ ఈ రోజు(6 ఫిబ్రవరి 2022) 750 కంటే ఎక్కువ రైళ్లను రద్దు చేసింది. 6 ఫిబ్రవరి 2022న, రైల్వేశాఖ అనేక రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. కరోనా కాలంలో రైల్వేలు చాలా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు కూడా పరిమిత సంఖ్యలోనే రైళ్లను నడుపుతుంది రైల్వేశాఖ.

రైల్వే సమస్యల లిస్ట్:
ప్రతిరోజూ రద్దు చేయబడిన రైళ్ల జాబితాను రైల్వే ప్రతిరోజూ జారీ చేస్తుంది. మీరు రైలులో ప్రయాణించాలని ప్లాన్‌ చేసుకుంటే మాత్రం.. ఖచ్చితంగా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను చెక్ చేసుకోండి. మీరు ఈ జాబితాను రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

రైలు విచారణపై పూర్తి సమాచారం..
భారతీయ రైల్వేలు ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లు నడుపుతున్నాయి. అదే సమయంలో, అనేక రైళ్లు రద్దు అవుతున్నాయి. మెయింటినెన్స్ కారణాల వల్ల రైల్వేశాఖ ఈ రైళ్లను రద్దు చేసింది. రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.

రద్దు చేయబడిన రైళ్ల అధికారిక వెబ్‌సైట్ లింక్:
ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల రైళ్లు ఉన్నాయి. మీరు ఈ అధికారిక లింక్ https://enquiry.indianrail.gov.in/mntes/ ద్వారా రద్దు చేయబడిన రైళ్ల జాబితాను చెక్ చేసుకోవచ్చు. ఇక. హోలీ సందర్భంగా రైళ్లలో అదనపు బోగీలను జోడించాలని రైల్వే నిర్ణయించింది. తద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఒకే రైలులో ప్రయాణించవచ్చు.