యతి ఉందా? : భారత ఆర్మీ ఫోటోలపై శాస్త్రవేత్తలు ఏమన్నారు

విశ్వంలో సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చే సైంటిస్టులు వాటిపై రీసెర్చ్ చేస్తున్నారు.

  • Publish Date - May 2, 2019 / 01:56 AM IST

విశ్వంలో సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చే సైంటిస్టులు వాటిపై రీసెర్చ్ చేస్తున్నారు.

విశ్వంలో సైన్స్‌కు అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చే సైంటిస్టులు వాటిపై రీసెర్చ్ చేస్తున్నారు. హిమాలయాల్లో అటువంటి అధ్భుతం యతి(మంచు మనిషి) అంటూ ఇండియన్ ఆర్మీ ఫోటోలను పోస్ట్ చేసిన క్రమంలో యతి గురించి దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.

అసలు ‘యతి’ ఉందా? అనే చర్చ జరుగుతుండడంతో దీనిపై భారత శాస్త్రవేత్తలు, పరిశోధకులు వారి స్పందనను తెలియజేశారు. ఇండియన్ ఆర్మీ యతి గురించి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందని బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ(బీఎన్‌హెచ్‌ఎస్‌) డైరెక్టర్‌ దీపక్‌ ఆప్టే వెల్లడించారు.
Also Read : హిమాలయాల్లో మంచు మనిషి: భారత్ ఆర్మీ ట్వీట్

ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలాంటి వింత ఘటనలు జరుగుతుంటాయని, కానీ బలమైన శాస్త్రీయ ఆధారాలు లభించేవరకు వీటిని నిర్ధారించడం కరెక్ట్ కాదని అన్నారు. ఆర్మీ ప్రచురించిన ఫోటోల్లోని అడుగులు యతివి అని చెప్పలేమని అన్నారు.

వీటిపై మరింత పరిశోధన, చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. హిమాలయాల్లో తిరుగాడే గోధుమ రంగు ఎలుగుబంట్ల పాదముద్రలు కూడా ఇవి అయి ఉండవచ్చునని అన్నారు. అవి ఒక్కోసారి వెనక పాదాలతో నడుస్తాయని అప్పుడు పడిన అడుగుల గుర్తులు ‘యతి’ పాదముద్రలు మాదిరిగా అనిపిస్తాయని తెలిపారు.