పాక్, చైనాతో కలిసి రష్యా లో భారత దళాల మిలిటరీ ఎక్సర్ సైజ్

త్రివిధ దళాలకు చెందిన 200 మంది సిబ్బందిని కవ్కాజ్ -2020 ఎక్సర్ సైజ్ లో పాల్గొన్నందుకు సెప్టెంబర్‌లో రష్యాకుపంపుతున్నట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

భారత బృందంలో… సైన్యం నుండి 160 మంది సిబ్బందితో పాటు, భారత వైమానిక దళానికి చెందిన 40 మంది సైనికులు మరియు ఇద్దరు పరిశీలకులు ఉన్నారు.

అనేక ఇతర దేశాలతో పాటు, చైనా మరియు పాకిస్తాన్ దళాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.దక్షిణ రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రావిన్స్‌లో ఈ ఎక్సర్ సైజ్ జరుగుతోంది.

ఇక్కడ షాంఘై సహకార సంస్థ మరియు మధ్య ఆసియా దేశాల సభ్య దేశాలు పాల్గొంటాయి. కాగా, చైనా, పాకిస్తాన్ రెండింటితో కలిసి భారత్ ఇంతకుముందు ఈ ఎక్సర్ సైజ్ లో పాల్గొంది.