ఆడవాళ్లు 50 ఏళ్లు వచ్చేనాటికి, 65వేల కిలోమీటర్లు నడుస్తారంట

  • Publish Date - October 16, 2020 / 03:52 PM IST

Women will walk 65,000 km by the age of 50: కొందరు మహిళలు ఇంటిదగ్గరుండి, పిల్లల ఆలనా పాలన చూస్తారు‌. అయినా వాళ్ల పని తక్కువకాదు. మరి ఉద్యోగాలు చేస్తున్నవాళ్ల సంగతి? కిచెన్ నుంచి హాలు వరకు, ఇంటి నుంచి ఆఫీసు, జర్నీలు, టూర్లు…అన్నీ కలపి ఆడవాళ్లు ఎంతమేర నడుస్తారో సైంటిస్ట్‌లకో డౌట్‌వచ్చింది. మగవాళ్లకంటే కాళ్లు కుదురుగా ఉండవు. మరి ఆడవాళ్ల సంగతేంటి? అందుకే స్టడీచేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ల ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఇంటి నుంచి ఆఫీసు వరకు, అప్పుడప్పుడు మార్కెట్, చాలా అవసరాల కోసం ఆడవాళ్లు వారానికి 51,330 అడుగులు నడుస్తారంట. అంటే 24
మైళ్లు. కిలోమీటర్లలో చెప్పాలంటే 38. 50 ఏళ్లు వచ్చేనాటికి 64373 కిలోమీటర్లంట.



18 నుంచి 50 ఏళ్లవరకు యేడాదికి 26,69,190 అడుగులు, 2032 కిలోమీటర్లు. యేడాదికి రెండేవేల కిలోమీటర్ల దూరంమేర నడకా? హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కు దూరం ఎంతనకున్నారు? 1,832కిలోమీటర్లు. అంటే యేడాదికి అంత దూరం ఆడవాళ్లు నడుస్తున్నారా?

ఈ స్టడీలోని మహిళ్లలో 70శాతం పనిచేస్తున్నారు. వాళ్లు రోజుకు 7 గంటలు నడుస్తూనే ఉంటారంట. అంటే ఇంటిదగ్గర పనులు, ఆఫీసులోనూ నిలువకాళ్లమీదనే ఉంటారంట.




యేడాదిలో రోజుల బట్టి లెక్కవేస్తే, నిల్చొనే 7రోజుల పాటు వంటచేస్తారు.
5రోజులు ఎక్స్‌ర్‌సైజులు పిల్లలతో ఆటలు, క్లీనింగ్, ఫ్రెండ్స్ ఇంటికెళ్లడం…
ఇలాంటి వ్యాపకాలతో నడుస్తూనే ఆడవాళ్లు ఎక్కువుగా నిల్చొనే ఉంటారు. నడుస్తుంటారు.ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడవాళ్లు యావరేజ్‌గా 7 ఉద్యోగాలు మార్చుతారు.

మరి ఇంత దూరం నడుస్తామన్న సంగతి ఆడవాళ్లకు తెలుసా? స్టడీ సమాధానం నో.ఎంత పనిచేస్తున్నామో వాళ్లకు తెలియదు. ఇంటిపనిలో మహిళలకు ఆనందముంటుంది. అందుకే వాళ్లు ఎంతసేపు నిల్చున్నా…నడిచినా పట్టించుకోరన్నది సైకాలజిస్ట్‌ల మాట. అంతెందుకు, ఇండియాలాంటి దేశాల్లో మహిళలకు పనికెక్కువ. జాబ్ చేసినా ఇంటిపని తప్పదు.




నిజంగా ఉద్యోగాలు చేస్తూనే ఇంటి వ్యవహారాలను పట్టించుకోవడం అంతసులువేంకాదు. అందుకే మగాళ్లు ఇంటిపనుల జోలికెళ్లరు. మహిళలు మాత్రం, ఉన్న ప్రతి ఉద్యోగ అవకాశాలను వాడుకొంటూనే అన్ని బాధ్యతలను నెలవేర్చడంటే ఇన్సిపరేషనే కదా అంటారు సైకాలజిస్ట్‌లు.

ఈ స్టడీ మరో సంగతిని బైటపెట్టింది. 50 ఏళ్లు వచ్చేసరికి,
సగటు మహిళకు, ఇద్దరు పిల్లున్నారు. మరో ఇద్దరు మనమలు, మనమరాళ్లున్నారు. వాళ్ల బాధ్యతాతీసుకొంటారు.

ఇంత పని, ఇన్ని బాధ్యతల మధ్య యేడాదికి రెండుమిలియన్ల మేర అలసటలేకుండా అడుగులువేయడమంటే… నిజంగా అద్భుతం.


ట్రెండింగ్ వార్తలు