Gujarat Floods : భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 16మంది…

నైరుతి రుతుపవనాల ప్రభావం... బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ప్రభావం వల్ల  దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్న సంగతి తెలిసిందే.

Gujarat Valsad

Gujarat Floods :  నైరుతి రుతుపవనాల ప్రభావం… బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ప్రభావం వల్ల  దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్న సంగతి తెలిసిందే.

భారత  వాతావరణ శాఖ కొన్నిరాష్ట్రాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల ప్రజలు వరద నీటిలో చిక్కుకుంటున్నారు.  గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలకు  వల్సాద్ జిల్లాలోని అంబికా నదికి ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ఈవరదల్లో దాదాపు 16 మంది చిక్కుకుపోయారు. ఈసమాచారం జిల్లా కలెక్టర్ కు తెలిసింది.

వెంటనే ఆయన కోస్ట్ గార్డు అధికారులను సంప్రదించారు. దీంతో  రంగంలోకి దిగిన  కోస్టు గార్డ్ అధికారులు చేతక్ హెలికాప్టర్ ద్వారా   అతి కష్టం మీద 16మందిని కాపాడారు. ఆ సమయంలో అక్కడ వీస్తున్న బలమైన గాలులకు హెలికాప్టర్ సైతం ఒడిదుడుకులకు లోనయ్యింది.