INS Dhruv: ఇండియా మొట్టమొదటి క్షిపణి ట్రాకింగ్ నౌక ‘ధృవ్’.. ఈరోజే ప్రయోగం!

ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు దాని వెలుపల శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ నుండి ఎక్కువగా మనకి ఎదురవుతున్న బెదిరింపులను పరిగణనలోకి తీసుకుని ఇండియా మరింత బలీయంగా సిద్దమవుతుంది.

Ins Dhruv

INS Dhruv: ఇండో-పసిఫిక్ ప్రాంతంతో పాటు దాని వెలుపల శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ నుండి ఎక్కువగా మనకి ఎదురవుతున్న బెదిరింపులను పరిగణనలోకి తీసుకుని ఇండియా మరింత బలీయంగా సిద్దమవుతుంది. ఆయుధశాలలో ఐఎన్ఎస్ ధృవ్ (INS Dhruv) క్షిపణి ట్రాకింగ్ నౌకను తనలో చేర్చుకొని భారత నౌకాదళం తన ఉనికిని పెంచుకొనేందుకు సిద్ధమైంది. దీంతో ఇండియా సముద్ర యుద్ధ శక్తి పెరగబోతోంది. ఇండియా మొట్టమొదటి క్షిపణి ట్రాకింగ్ నౌక ‘ధృవ్’ (INS Dhruv) ఈరోజే (సెప్టెంబర్ 10)న సముద్రంలో ప్రయోగం ప్రారంభించనుంది.

అణు, బాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేయగలిగే భారతదేశపు మొదటి నౌక ఇదే కాగా ధృవ్ (INS Dhruv) ప్రారంభంతో ఈ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలో 5వ దేశంగా భారత్ అవతరించనుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీని అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా మాత్రమే కలిగి ఉన్నాయి. ఈరోజు ప్రయోగించనున్న 10,000 టన్నుల నౌక ధృవ్ (INS Dhruv)ను ఏపీలోని విశాఖపట్నం నుండి భారత నావికాదళం, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO), ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ప్రయోగించనున్నారు.

ఐఎన్ఎస్ ధృవ్ (INS Dhruv) భారతదేశ భవిష్యత్తులో బాలిస్టిక్ వ్యతిరేక సామర్థ్యాలకు కేంద్రంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దేశ ఉనికిని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐఎన్ఎస్ ధ్రువ్ (INS Dhruv), దాని బాలిస్టిక్ వ్యతిరేక క్షిపణి సామర్థ్యాలతో, భారత నగరాలు, సైనిక సంస్థల వైపు వెళ్లే శత్రు క్షిపణుల కోసం ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తుంది. అత్యాధునిక యాక్టివ్ స్కాన్డ్ అర్రే రాడార్ (AESA)ను కలిగి ఉండే ధృవ్.. వివిధ స్పెక్ట్రమ్‌లను స్కాన్ చేయడానికి, భారతదేశాన్ని చూసే గూఢచారి ఉపగ్రహాలను పర్యవేక్షించడానికి, అలాగే మొత్తం ప్రాంతంలో క్షిపణి పరీక్షలను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది.

అధునాతన జలాంతర్గాముల వాడకంతో నీటి అడుగున కూడా యుద్ధం, నిఘా డ్రోన్‌ల యుగం వచ్చిన సమయంలో ఇండో-పసిఫిక్‌లో భారతదేశ సముద్ర అవగాహనలో ఐఎన్ఎస్ ధృవ్ (INS Dhruv) కీలక పాత్ర పోషిస్తుంది. భారత నావికాదళం ఇప్పుడు ధృవ్ తో మలక్కా, సుండా, లోంబోక్, ఒంబై, దక్షిణ చైనా సముద్రం వరకు అడెన్ గల్ఫ్ నుండి దక్షిణ చైనా సముద్రం వరకు మొత్తం ప్రాంతాన్ని గమనిస్తుంది. వెటర్ స్ట్రైట్స్, ఇండియా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్-సేకరణ గూఢచారి సంస్థ, NTRO, ఈ ప్రాంతాలలో డేటాను సేకరించనుంది. ధృవ్‌ రాకతో భారత నావికాదళం ఇప్పుడు తన సైనిక కార్యకలాపాలను నౌకా యుద్ధంలోని మూడు కోణాలలో మెరుగ్గా వ్యూహరచన చేయవచ్చు. భారతదేశ అణు క్షిపణి ట్రాకింగ్ నౌక ధృవ్ ను వ్యూహాత్మక దళాల కమాండ్ (SFC)తో భారత నౌకాదళ సిబ్బంది నిర్వహించనున్నారు.