హార్వర్డ్ లో ఫెయిల్యూర్స్ కేస్ స్టడీగా భారత్ కరోనా పోరాటం

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. భారతదేశపు కరోనా COVID-19 పోరాటం హార్వర్డ్ బిజినెస్ స్కూల్​లో కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ విమర్చించారు. కొవిడ్ కేసుల్లో రష్యాను దాటి మూడో స్థానంలో భారత్ నిలిచిన నేపథ్యంలో రాహుల్‌…కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

కరోనా వైరస్, జీఎస్టీ, నోట్ల రద్దు అమలులో ప్రభుత్వ వైఫల్యం భవిష్యత్‌లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలను ఆ ట్వీట్ లో తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలను ఎద్దేవా చేస్తూ ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.

ఈ వీడియోలో మహాభారత యుద్ధంలో పాండవులు 18 రోజుల్లో గెలిచారని, కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో దేశం 21 రోజుల్లో విజయం సాధిస్తుందన్న ప్రధాని మాటలను ఆయన పోస్ట్‌ చేశారు. కరోనావైరస్ కేసుల పెరుగుదలకు సంబంధించిన గ్రాఫ్‌ను వీడియోలో చూడవచ్చు.