దేశీయంగా రూపోందించిన అస్త్ర క్షిపణి పరీక్ష విజయవంతం

  • Publish Date - September 17, 2019 / 02:34 PM IST

దేశీయ పరిజ్ఞానంతో రూపోందించిన  ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి అస్త్రను భారత  వైమానిక దళం మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. డీఆర్డీవో రూపోందించిన అస్త్ర ను  సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానానికి అమర్చి గగనతలంలో ప్రయోగించినట్లు రక్షణశాఖ విడుదలచేసిన ప్రకటనలో తెలిపింది.  అస్త్ర పరిధి 70 కిలోమీటర్లు. క్షిపణి లక్ష్యం దిశగా దూసుకు పోతున్న తీరును వివిధ రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ సెన్సార్లు గుర్తించాయని  రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.  పరీక్ష విజయవంతం అవటం పట్ల రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ డీఆర్డీవో ను అభినందించారు. 

అస్త్ర ప్రత్యేకతలు
దేశీయంగా డీఆర్డీవో రూపోందించిన ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి.
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల సహాకారంతో దీన్ని  రూపోందించారు.
దీని పరిధి 70 కిలోమీటర్లు.
గంటకు 5,555 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగల శక్తివంతమైనది.
గాలిలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు గగనతలంనుంచే దీన్ని ప్రయోగించవచ్చు.
ఇందులో అత్యధిక పేలుడు స్వభావం కలిగిన 15 కిలోల మందుగుండుతో కూడిన వార్ హెడ్ ఉంటుంది.
అస్త్ర క్షిపణిని ప్రయోగించేందుకు సుఖోయ్-30 యుధ్ధ విమానాల్లో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మార్పులను హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేసింది.