×
Ad

Indigo : ఇండిగో విమానంలో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తు కూల్ డ్రింక్ పేరుతో దోపిడీ అంటూ బీజేపీ నేత ఫిర్యాదు .. దిగి వచ్చిన సంస్థ

ఇండిగో విమానంలో కూల్ డ్రింక్ పేరుతో దోచుకుంటున్నారని..ప్రయాణీకులతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారు అంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో సందరు సంస్థ దిగి వచ్చింది. కీలక నిర్ణయం తీసుకుంది.

  • Published On : September 20, 2023 / 10:49 AM IST

Indigo flight

Indigo flight : ఇండిగో విమానం(Indigo flight)లో ప్రయాణించిన మాజీ బీజేపీ ఎంపీ, బీజేపీ నేత స్వపన్ దాస్‌గుప్తా (former Rajya Sabha Dasgupta) విమానంలో కూల్ డ్రింక్ పేరుతో దోచుకుంటున్నారని..ప్రయాణీకులతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. స్నాక్స్ కొనేల ధరల్లో లేవని అధిక ధరలకు అమ్ముతున్నారని బలవంతంగా ప్రయాణీకులతో కొనిపిస్తున్నారని..విమానంలో కూల్ డ్రింక్స్ అమ్మకంపై మండిపడ్డారు ఫిర్యాదు చేశారు. ప్రయాణీకులకు ఇష్టం లేకపోయినా ఇండిగో విమాన సిబ్బంది వారితో స్నాక్స్ ను బలవంతంగా కొనేలా చేస్తోంది అంటూ ఇండిగో సంస్థపై స్వపన్‌దాస్ గుప్తా కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా( Minister Jyotiraditya Scindia_కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతో ఇండిగో విమానయాన సంస్థ స్పందిస్తు కీలక నిర్ణయం తీసుకుంది. తన మెనూను సవరించింది. కూల్ డ్రింక్స్ ను క్యాన్స్‌లో అందించబోమని..స్నాక్స్‌తో పాటు కాంప్లిమెంటరీగా గ్లాసు జ్యూస్‌ను, కోక్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

IndiGo flight : ఇండిగో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం…ప్రయాణికుల కలకలం

గతంలో విమానం మెనూలో జీడిపప్పు (రూ.200) కోక్ (రూ.100) ఉండేది. దీంతో మొత్తం రూ.300లు చెల్లించవలసి వచ్చేదని..కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో చేసిన మెనూ మార్పు ప్రకారంగా స్నాక్స్ కొనుగోలుపై (రూ.200) కూల్ డ్రింక్ లేదా కోక్ వంటి డ్రింక్స్ ను ఫ్రీగానే అందిస్తామని వెల్లడించింది. అలాగే ఆల్ లైన బోర్డు సర్వీసుల్ని పూర్తిగా కష్టమర్లకు సెలక్షన్ కు అనుగుణంగా ఉంటాయని ప్రకటించింది.

కాగా ఎయిర్ లైన్ ప్రకారం. కష్టమర్లు ఆన్ లైన్ బోర్డ్ లో కొనుగోలు చసిన ఏదైనా స్నాక్ తో కాంప్లిమెంటరీ డ్రింక్ ను ఎంజాయ్ చేయవచ్చు. ఇండిగో 63 శాతం కంటే ఎక్కువ దేశీయ మార్కెట్ వాటాతో దేశంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ అనే విషయం తెలిసిందే.