Jayalalitha Death : జయలలిత మృతిపై విచారణ పూర్తి .. సీఎం స్టాలిన్ చేతికి 600ల పేజీలతో ఆర్ముగ స్వామి నివేదిక

జయలలిత మృతిపై విచారణ పూర్తి అయ్యింది. దీంతో సీఎం స్టాలిన్ చేతికి ఆర్ముగ స్వామి నివేదిక అందజేశారు.

Former Chief Minister J Jayalalitha : దివంగత నేత జయలలిత..తమిళులు ‘అమ్మ’గా పిలుచుకునే మరణ కేవలం తమిళనాడునే కాదు యావత్ భారతాన్ని విషాదంలో ముంచేసింది. జయలలిత మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆమెకు అందించిన వైద్య సేవల విషయంలో కూడా పలు అనుమానాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో జయలలిత మృతిపై విచారణ కోసం తమిళనాడు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆరుముగ స్వామి కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఐదేళ్లుగా వివిధ పార్టీలకు చెందిన పలువురిని విచారించింది. పలువురు వైద్యులను..పోలీసులను కూడా విచారించింది. ఈ విచారణ పూర్తి కావటంతో సీఎం స్టాలిన్ చేతికి రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగ స్వామి నివేదికను అందజేశారు. జయలలిత మృతిపై నివేదిక అందజేశారు.

మాజీ CM జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 2017లో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆర్ముగస్వామి కమిషన్ ఐదేళ్లుగా వివిధ పార్టీలను విచారించింది. జయలలిత సహచరులు, బంధువులు, అధికారులు, మాజీ మంత్రులను విచారించింది. అటు కమిటీ పరిశీలించిన 75 మంది సాక్ష్యులలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్పట్లో విధులలో ఉన్న చెన్నై పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇలా దాదాపు 160మందికిపైగానే కమిషన్‌ విచారించింది.

చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందిన చికిత్సపై అనుమానాలు నెలకొన్నాయి. జయలలిత నెచ్చెలి శశికళ, పార్టీ నేతలు సహా ఎవ్వరినీ జయతో కలవనివ్వలేదు. ఆమె ఇష్టారాజ్యంగానే జయలలితకు వైద్యం అందింది. ఈ క్రమంలో పలు వదంతులు రావడంతో అపోలో ఆసుపత్రి, ఆమెకు చికిత్స అందించిన ఎయిమ్స్ వైద్యులను కూడా విచారించారు. అయితే జయలలితకు అందించిన చికిత్సలో ఎలాంటి లోపాలూ లేవని ఎయిమ్స్‌ వైద్యబృందం ఆర్ముగస్వామి కమిషన్‌కు తెలిపింది. జయలలిత 2016లో అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారని కమిషన్‌కు ఎయిమ్స్‌ వైద్యబృందం మూడు పేజీల నివేదిక సమర్పించింది. రిటైర్డ్‌ జస్టిస్‌ ఆరుముగస్వామి తమిళం, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందించిన దాదాపు 600 పేజీల తుది నివేదికను స్టాలిన్‌కు సమర్పించనున్నారు. జయలలిత మరణంలో మిస్టరీగా ఏర్పాటైన ఆరుముగసామి కమిషన్‌ ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

 

ట్రెండింగ్ వార్తలు