Delhi : ఢిల్లీకి భారీ ఉగ్రదాడి ముప్పు..నిఘా వర్గాల హెచ్చరికలతో..హై అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రదాడి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఆగస్టు , స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరపడుతున్న వేళ ఈ హెచ్చరికలు జారీ కావటంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యాయి.

Intelligence warns Delhi terror attacks : దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రదాడి ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఆగస్టు , స్వాతంత్ర్య దినోత్సవం దగ్గరపడుతున్న వేళ ఈ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల సాయంతో ఢిల్లీపై విరుచుకుపడేందుకు ఉగ్రవాదులు పక్కా ప్లాన్ వేశాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేసాయి.

ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర సెక్యూరిటీ విభాగాలన్నీ అప్రమత్తమయ్యాయి. తీవ్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుంటూ తనిఖీలను ముమ్మరంచేశాయి. ఆగస్టు 15కి ముందే దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని నిఘా వ్యవస్థ వివరించటంతో ఢిల్లీ ఇప్పటినుంచే అప్రమత్తమయ్యింది.

కాగా భారత్ బోర్డర్ లో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా పాక్ సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం కలిగించిన విషయం తెలిసిందే. ఇటువంటివి భారత్ పై ఉగ్రవాదులు దాడులు చేయటానికేననే సంకేతాలు ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికల ద్వారా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కశ్మీర్ సరిహద్దుల్లో గుర్తుతెలియని డ్రోన్ల సంచారం అధికమైంది. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్థావరం వద్ద డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. దాంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. ఇలా అన్ని భత్రదా చర్యలతో ఢిల్లీ హై అలర్ట్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు