Jagdish Lad : ఉక్కు మనిషిని సైతం పిండి చేసేసిన కరోనా, ప్రముఖ అంతర్జాతీయ బాడీబిల్డర్ జగదీష్‌ కోవిడ్‌తో మృతి

కరోనావైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకారో మరోసారి ప్రూవ్ అయ్యింది. పేదలు, ధనికులు.. చిన్న, పెద్ద.. సామాన్యుడు, సెలెబ్రిటీ.. అనే తేడా లేదు... కరోనా మహమ్మారి అందరినీ కాటేస్తోంది. ఈ వైరస్ మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. తాజాగా.. ఉక్కులాంటి మనిషిని సైతం కరోనా పిండి చేసేసింది అనే వార్త సంచలనంగా మారింది. అందరిలోనూ భయాందోళనలు నింపింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాడీబిల్డర్ జగదీష్ ను కరోనా బలితీసుకుంది.

Jagdish Lad : కరోనావైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకారో మరోసారి ప్రూవ్ అయ్యింది. పేదలు, ధనికులు.. చిన్న, పెద్ద.. సామాన్యుడు, సెలెబ్రిటీ.. అనే తేడా లేదు… కరోనా మహమ్మారి అందరినీ కాటేస్తోంది. ఈ వైరస్ మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. తాజాగా.. ఉక్కులాంటి మనిషిని సైతం కరోనా పిండి చేసేసింది అనే వార్త సంచలనంగా మారింది. అందరిలోనూ భయాందోళనలు నింపింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాడీబిల్డర్ జగదీష్ ను కరోనా బలితీసుకుంది.

భారతదేశం బాడీ బిల్డర్లు గురించి మాట్లాడితే జగదీష్ లాడ్ టక్కున గుర్తుకు వస్తారు. బాడీ బిల్డింగ్‌లో ఎన్నో అగ్రశ్రేణి టైటిళ్లు గెలుచుకున్న కండల వీరుడు జగదీష్. ఉక్కుమనిషిగా గుర్తింపు పొందారు జగదీష్. అలాంటి వ్యక్తి కరోనాతో కన్నుమూశారు. జగదీష్ వయసు కేవలం 34 సంవత్సరాలు. బరోడాలో ఆయన తుది శ్వాస విడిచారు. కరోనాతో జగదీష్ మరణించారనే వార్త బాడీబిల్డింగ్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

నవీ ముంబైలో నివసిస్తున్న జగదీష్ కొన్నేళ్ల క్రితమే బరోడాకు షిఫ్ట్ అయ్యారు. బరోడాలో ఓ జిమ్ కేంద్రంలో జాబ్ రావడంతో అక్కడికి వెళ్లారు. వాస్తవానికి సంగ్లీ జిల్లాలోని కుండల్ గ్రామం జగదీష్ స్వస్థలం. కాగా, కొద్దిరోజుల క్రితం జగదీష్, ఆయన భార్య కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం(ఏప్రిల్ 30,2021) కన్నుమూశారు.

బాడీబిల్డింగ్ పోటీలో జగదీష్ నిలబడితే కచ్చితంగా టైటిల్ ఆయనదే. ఎందుకంటే అతడి వంపులు తిరిగిన కండలు, బాడీ ఆకృతి ముందు మిగిలినవారు తేలిపోతారు. అలాంటి ఆకృతి కోసం జగదీష్ చాలా కష్టపడ్డారు. ప్రతి ఉదయం రెండు గంటలు వ్యాయామం చేసేవారు. ప్రోటీన్, చికెన్, గుడ్లు, మాంసంతో పాటుగా మంచి పౌష్టికాహారం రోజూ తీసుకునేవారు.

జగదీష్ లాడ్ చిన్న వయస్సులోనే బాడీబిల్డింగ్ ప్రారంభించారు. మహారాష్ట్రలో దాదాపు నాలుగు సార్లు బంగారు పతకం సాధించారు. మిస్టర్ ఇండియా పోటీలో రెండు బంగారు పతకాలు కూడా గెలుచుకున్నారు. ముంబైలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నారు.

ఆయన మరణానికి మహారాష్ట్ర బాడీబిల్డింగ్ అసోసియేషన్, ముంబై అసోసియేషన్ విచారం వ్యక్తం చేశాయి. బాడీబిల్డింగ్ ప్రపంచంలో సుపరిచితమైన వ్యక్తిని కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశాయి. జగదీష్ ”భారత్ శ్రీ” టైటిట్ గెల్చుకున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.

కాగా, నాలుగేళ్ల క్రితమే బాడీబిల్డింగ్ వదిలేశారు. లాక్ డౌన్ కారణంగా ఆయన జీవితం చిన్నాభిన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగదీష్ తో పాటు మరో బాడీబిల్డర్ లకన్.. సరైన ట్రీట్ మెంట్ అందలేదు. దీని కారణంగానే చనిపోయారు. జగదీష్ భార్య సైతం కరోనా బారిన పడ్డారు. రెంట్ కట్టని కారణంగా ఇంటి యజమాని వారిని బయటకు వెళ్లనివ్వలేదు. కరోనా ఎవరికైనా రావొచ్చు. బాడీబిల్డర్లు అతీతం కాదు. బాడీబిల్డర్లు దేవుళ్లు కాదు. మేము కూడా కరోనా బారిన పడొచ్చు. తీవ్రంగా ఇబ్బంది పడొచ్చు” అని ఇంటర్నేషనల్ బాడీబిల్డర్ సమీర్ దబిల్ కర్ అన్నారు.

జగదీష్ ఇక లేడనే వార్తనే సహచర బాడీబిల్డర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఇంకా షాక్ లోనే ఉన్నారు. అతడితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.

జగదీష్ నవీ ముంబై నుంచి రెండు మూడేళ్ల క్రితమే బరోడా వచ్చాడు. ఓ జిమ్ ను చూసుకునే జాబ్ రావడంతో బరోడాకి షిఫ్ట్ అయ్యాడు. రైల్వేలో ఉద్యోగం కోసం నా దగ్గరికి వచ్చాడు. కానీ, పెద్ద పోస్టు కావాలని అడిగాడు. దాంతో నేనే ఏమీ చెయ్యలేకపోయాను. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో ఏదో మంచి ఆఫర్ వచ్చిందని చెప్పాడు. అయితే, పెరుగుతున్న అతడి వయసు ఉద్యోగాలకు అడ్డంకిగా మారింది. దీంతో నవీ ముంబైకి షిఫ్ట్ అయ్యాడు.

గత వారం సెంట్రల్ రైల్వే బాడీబిల్డర్ ని కూడా మేము కోల్పోయాం. మనోజ్ లకన్(30) సైతం కరోనాతో చనిపోయాడు. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోనేలేదు. జగదీష్ లాడ్, మనోజ్ లకన్..ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన వారే. జగదీష్ బరోడాలో సెటిల్ అయ్యాడు. బరోడాకు ఎన్నో మెడల్స్ సాధించి పెట్టాడు. అతడే కాదు మహారాష్ట్రకు చెందిన ఎంతోమంది బాడీబిల్డర్లు నాతో టచ్ లో ఉన్నారు. పోటీలు జరిగినప్పుడు అతడిని ఆహ్వానించే వాళ్లం. యూట్యూబ్ లో లైవ్ లో టోర్నమెంట్స్ చూసేవాడు. చాలా మంది వ్యక్తి. సంగ్లీ, మిస్టర్ మహారాష్ట్ర ఈవెంట్స్ లో పలు మార్లు పాల్గొన్నాడు. అతడి బాడీ స్ట్రక్చర్ చాలా బాగుంది. ప్రామిసింగ్ బాడీబిల్డర్. జగదీష్ ఇక లేడు అనే వార్త తెలిసి చాలా బాధపడ్డాను” అని గ్రేటర్ బాంబే బాడీబిల్డింగ్ అసోసియేషన్ ట్రెజరర్ ప్రభాకర్ కదమ్ అన్నారు.

”జగదీష్ లాడ్ సీనియర్ బాడీబిల్డర్. చాలా మంచి వ్యక్తి. ఇండియన్ బాడీబిల్డింగ్ కు ఇది పెద్ద లోటు. అతడి మిస్ అవుతున్నాం. రెస్ట్ ఇన్ పవర్” అని ప్రొఫెషనల్ బాడీబిల్డర్ అండ్ పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ రాహుల్ వాపోయారు.

 

ట్రెండింగ్ వార్తలు