iPhone 13 Gift to MLAs : అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికి ఐఫోన్ 13 సర్‌ప్రైజ్‌ గిఫ్ట్..!

ఐఫోన్ 13 ప్రీ ఆఫర్.. అందరికి కాదండోయ్.. కేవలం ప్రజాప్రతినిధులకేనట.. రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలోని 200 మంది ఎమ్మెల్యేలందరికి సర్ ప్రైజ్ గిప్ట్‌గా ఐఫోన్ 13 ఫోన్ ఆఫర్ చేసింది.

iPhone 13 Gift to MLAs :  ఐఫోన్ 13 ప్రీ ఆఫర్.. అందరికి కాదండోయ్.. కేవలం ప్రజాప్రతినిధులకేనట.. రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలోని 200 మంది ఎమ్మెల్యేలందరికి సర్ ప్రైజ్ గిప్ట్‌గా ఐఫోన్ 13 ఫోన్ ఆఫర్ చేసింది. ఎమ్మెల్యేలకు ఇచ్చిన అన్ని బ్రీఫ్ కేసుల్లో కొత్త ఐఫోన్ 13 కానుగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. రాజస్థాన్‌లో బుధవారం ఈ దృశ్యాలు కనిపించాయి. రాజస్థాన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను సమర్పించింది. బడ్జెట్‌ సమావేశాల అనంతరం.. సభలోని 200 మంది ఎమ్మెల్యేలకు ఆనవాయితీగా లెదర్‌ బ్రీఫ్‌కేసులు అందించింది. ఈసారి ఖాళీ బ్రీఫ్ కేసులు కాదండోయ్.. ఆ బ్రీఫ్‌కేసులో సర్‌ప్రైజ్‌గా బ్రాండ్‌ న్యూ ఐఫోన్‌ 13ను గిఫ్ట్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ ఐఫోన్ ధర రూ. 75 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉంటుంది.

ఇదివరకే.. అసెంబ్లీలో బడ్జెట్‌ సందర్భంగా ఐప్యాడ్‌లను ఎమ్మెల్యేలకు అందించింది అశోక్‌ గెహ్లాట్‌ సర్కార్‌. ఎప్పటిలాగే అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు బడ్జెట్‌ ముగియగానే.. ఆ ప్రతులను ఉంచిన బ్యాగులను ఇవ్వడమనేది పరిపాటి.. బడ్జెట్‌ పేపర్స్‌తో పాటు కాస్ట్‌లీ గాడ్జెట్స్‌ అందిస్తున్నారు. ఈ ఐఫోన్‌ గిఫ్ట్‌ల విలువ మొత్తం కోటిన్నరట.. పార్టీలకతీతంగా గిఫ్ట్‌లు తీసుకుని ఫ్రీగా వచ్చిన కొత్త ఐఫోన్‌తో ఫొటోలకు ఫోజులిచ్చారు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల కోసం ఖరీదైన ఐఫోన్‌లను కొనుగోలు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ అశోక్ గెహ్లాట్ సర్కార్‌‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. రాష్ట్రంలోని మహిళలకు కూడా స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని బడ్జెట్‌లో ప్రకటించిందని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా అన్నారు.

Iphone 13 For All 200 Mlas Rajasthan Govt’s Surprise Gift After Budget Presentation 

రాజస్థాన్ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివే :
• రాజస్థాన్‌లోని పర్యాటక రంగానికి రాష్ట్రంలో పరిశ్రమ హోదా .
• గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాజస్థాన్ రూరల్ టూరిజం పథకం ప్రారంభించింది.
• ఇందిరా గాంధీ పట్టణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) తరహాలో తీసుకొచ్చింది. దీనికి రూ. 800 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించింది.
• బడ్జెట్‌లో మరో ప్రధాన ప్రకటన జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ వచ్చే ఏడాది నుంచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయనుంది.
• ప్రభుత్వ రంగంలో 1 లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
• వీరిలో 62,000 మంది గ్రేడ్ III ఉపాధ్యాయులను REET-2022 ద్వారా నియమించనున్నారు.
• అదేవిధంగా 1,000 కొత్త మహాత్మా గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రారంభించడం ద్వారా, 10,000 ఉపాధ్యాయుల కొత్త పోస్టులను భర్తీ చేయనుంది.
• రిక్రూట్‌మెంట్ పరీక్షలలో చీటింగ్‌ను చెక్ చేసేందుకు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) యాంటీ-చీటింగ్ సెల్ బడ్జెట్‌లో ప్రకటించింది.

Read Also : POCO M4 Pro : ఫిబ్రవరి 28న పోకో M4 ప్రో స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చు అంటే?

ట్రెండింగ్ వార్తలు