IPL 2022: ఐపీఎల్ వేలంలోనే కారును కూడా అమ్మకానికి పెట్టిన టాటా

ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్లేయర్లను సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుత వేలంతో దీంతో పాటు మరో విశేషం కూడా ఏర్పాటు చేసింది టాటా సంస్థ. లిమిటెడ్ ఎడిషన్ అయిన టాటా

IPL 2022: ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్లేయర్లను సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుత వేలంతో దీంతో పాటు మరో విశేషం కూడా ఏర్పాటు చేసింది టాటా సంస్థ. లిమిటెడ్ ఎడిషన్ అయిన టాటా పంచ్ కజిరంగాను వేలంలో అమ్మకానికి పెట్టింది.

ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కోసం ఖర్చు పెడతారు. పలు ప్రత్యేమైన ఫీచర్స్‌తో వస్తున్న.. కజిరంగా ఎడిషన్ విషయాలను టాటా మోటార్స్‌ అధికారికంగా వెల్లడించలేదు. దీనిని ప్రస్తుతం అభిమానుల కోసమే వేలం వేస్తున్నట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. వేలం గెలిచి కజిరంగా టాటా పంచ్‌ స్ఫెషల్‌ ఎడిషన్‌ ఎస్‌యూవీ కారును సొంతం చేసుకోవచ్చని టాటా మోటార్స్‌ ప్రకటించింది.

గతేడాది లాంచ్‌ చేసిన టాటా పంచ్‌ ఎస్‌యూవీకి ఇండియన్ మార్కెట్లలో మంచి ఆదరణ లభించింది. టాటా మోటార్స్‌లో బాగా సేల్‌ అవుతోన్న మోడల్‌గా టాటా పంచ్‌ నిలిచి తొలిసారి నెలవారీ విక్రయాలు 40వేలను దాటడంలో కీలకమైంది.

Read Also: ఐపీఎల్‌తో పాటు శివమ్ దూబెకు మరో గుడ్ న్యూస్

ఆటోమేటిక్‌ హెడ్‌లైట్స్‌ ఏడు అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, క్రైమెట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు, డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ఏబీఎస్‌, ఈబీడీ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. మోస్ట్ సేఫ్టీ రేటింగ్ ను కూడా దక్కించుకుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ సెటప్‌తో, 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 83బీహెచ్‌పీ వద్ద 113ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. టాటా పంచ్‌ ప్రారంభ ధర రూ.5.65 లక్షల నుంచి అత్యధికంగా రూ.9.29 లక్షల వరకు ఉంది.

ట్రెండింగ్ వార్తలు