Iran-Israel war : ఇజ్రాయెల్ చర్యలతో మళ్లీ పెరుగుతున్న టెన్షన్.. హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన! ట్రంప్ వార్నింగ్..

Iran-Israel war : ఇజ్రాయెల్ లెబనాన్ పై భీరక దాడులకు పాల్పడింది. ఇప్పటి వరకు జరగని రీతిలో అత్యంత భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 254కు చేరగా.. మరో వెయ్యి మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Iran-Israel war

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
  • అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణకు బ్రేక్?
  • హర్మూజ్ జలసంధి మళ్లీ క్లోజ్
  • ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

Iran-Israel war : ఇరాన్ – అమెరికా దేశాల మధ్యవార్ మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ – అమెరికా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో యుద్ధం తాత్కాలికంగా ముగిసినట్లు కనిపించింది. అయితే, లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. అమెరికాతో ఒప్పందం షరతులకు లోబడి హర్మూజ్ ను తెరిచిన టెహ్రాన్.. లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది.

Also Read : Iran: ఇరాన్ సంచలనం.. హర్మూజ్ జలసంధి మళ్లీ మూసివేత

ఇజ్రాయెల్ లెబనాన్ పై భీరక దాడులకు పాల్పడింది. కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు ప్రయోగించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు కలగజేసింది. ఇప్పటి వరకు జరగని అత్యంత భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య 254కు చేరగా.. మరో వెయ్యి మందికిపైగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ – లెబనాన్ ఘర్షణలు మధ్యప్రాచ్యలో శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.

ఇజ్రాయెల్ దాడుల తరువాత ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అన్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంతవరకు అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ దాడుల తరువాత ఇరాన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాలు వంటివన్నీ ఇరాన్, దాని పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయని ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే.. మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకుపడతామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. ట్రంప్ ఇరాన్ కు మరో కీలక వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిని తెరవాలి. ఈలోగా.. అమెరికా సైన్యం విశ్రాంతి తీసుకుంటూ, తమ తదుపరి మిషన్ కోసం ఎదురు చూస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు.