Toll Plaza : వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈనెల 10నుంచి టోల్గేట్ల వద్ద దాటాలంటే అవి ఉండాల్సిందే..!
Toll Plaza : జాతీయ రహదారిపై ప్రయాణాలు సాగించే వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Toll Plaza New Rules
- ఈనెల 10 నుంచి టోల్గేట్ల వద్ద నో క్యాష్
- డిజిటల్ చెల్లింపులు మాత్రమే అనుమతి
- ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే 1.25 శాతం అదనం
- హైవే ప్రయాణంలో గుర్తింపు కార్డు తప్పనిసరి
Toll Plaza New Rule: జాతీయ రహదారిపై ప్రయాణాలు సాగించే వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఫాస్టాగ్ విధానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 10వ తేదీ నుంచి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపేయనుంది.
Also Read: నా పాదయాత్ర మొదలవుతుంది.. ప్రతిరోజూ చంద్రబాబుకు వైసీపీ శ్రేణులు సినిమా చూపిస్తారు..
ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్ ను అతికించకపోతే టోల్ ప్లాజాలకు వచ్చే వాహనదారులు యూపీఐ ద్వారా టోల్ ఛార్జీలు చెల్లించవచ్చని, అయితే ఇందుకు 1.25 శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది.
ఏప్రిల్ 10నుంచి అన్ని టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చెల్లుబాటు అయ్యే ఫాస్ట్‌ట్యాగ్‌ను వాహనదారులు కలిగి ఉండాలని, ఇదిలేని వారు యూపీఐ ఆప్షన్‌తో చెల్లించవచ్చని చెప్పారు. ఇలాంటి వారు తప్పనిసరిగా 1.25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు.. జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు ప్రభుత్వం ఇచ్చిన ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధన కూడా ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానుంది.
ఇదిలాఉంటే.. వార్షిక పాస్ తీసుకున్న వారి సంఖ్య 50 లక్షలకు చేరింది. ఈ పాస్ ధర 3వేల రూపాయలు, దీనితో సంవత్సరానికి 200 సార్లు టోల్ ప్లాజాల నుంచి ప్రయాణించవచ్చు. గత సంవత్సరం ఆగస్టు 15 నుంచి వార్షిక పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఈ పాస్‌ల ద్వారా 26.55 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి.
