Farmers: రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్.. రూ.41534 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచంటే..
ఇది ఖరీఫ్ 2025 సీజన్‌కు కేటాయించిన రూ.37,216.15 కోట్ల కంటే సుమారు రూ.4,317 కోట్లు అధికం.
Farmers: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ ఉత్పాదకాలను అందుబాటు ధరలలో ఉంచేందుకుగాను ఎరువులపై ఇచ్చే సబ్సిడీని పెంచింది. ఖరీఫ్ సీజన్లో పీ అండ్ కే (ఫాస్ఫేటిక్ అండ్ పొటాసిక్) ఎరువులపై రూ.41,534 కోట్ల రాయితీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ఖరీఫ్ సీజన్‌కు ఈ సబ్సిడీ అమల్లో ఉంటుంది. డై-అమ్మోనియమ్ ఫాస్పేట్ (DAP) ధరలు అంతర్జాతీయంగా పెరిగినా రైతులపై భారం పడకుండా ఉండేందుకు ధరలలో మార్పులు చేయలేదని వెల్లడించింది. దీంతో 50 కిలోల బ్యాగ్ ధర రూ.1,350గా కొనసాగనుంది.
ఎరువులు, ముడిసరుకుల ధరల పోకడలకు అనుగుణంగా కేంద్రం సర్దుబాట్లు చేసింది. తాత్కాలిక సబ్సిడీ కేటాయింపును రూ.41,533.81 కోట్లుగా నిర్ధారించింది. ఇది ఖరీఫ్ 2025 సీజన్‌కు కేటాయించిన రూ.37,216.15 కోట్ల కంటే సుమారు రూ.4,317 కోట్లు అధికం. రైతులకు రాయితీతో కూడిన, అందుబాటు ధరలో ఎరువులు లభించేలా చూడటమే ఈ నిర్ణయం ముఖ్య లక్ష్యం. యూరియా, డీఏపీ, ఎంఓపీ, సల్ఫర్ వంటి కీలక ముడిసరుకుల అంతర్జాతీయ ధరలలోని ఇటీవలి మార్పులను పరిగణనలోకి తీసుకుని పీ అండ్ కే ఎరువులపై రాయితీ రేట్లను హేతుబద్ధీకరించడం కూడా దీని ఉద్దేశం.
NBS విధానం కింద ఆమోదించబడిన పోషక మోతాదుల ఆధారంగా ఎరువుల కంపెనీలకు సబ్సిడీని అందిస్తారు. దీనివల్ల DAP, NPKS గ్రేడ్లతో సహా P అండ్ K ఎరువులను నియంత్రిత ధరలకు సజావుగా సరఫరా చేయడానికి వీలవుతుంది.
ప్రభుత్వం ప్రస్తుతం తయారీదారులు, దిగుమతిదారుల ద్వారా 28 గ్రేడ్ల ఎరువులను రాయితీపై అందిస్తోంది. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తికి మద్దతుగా ఎరువుల అందుబాటు ధరలను కొనసాగించడం, వాటి లభ్యతను నిర్ధారించడం పట్ల కేంద్రం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.
Also Read: రైతులకి పండగలాంటి వార్త… 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ..
