IRCTC Contest : బంపర్ ఆఫర్.. లక్ష రూపాయలు గెలుచుకునే చాన్స్.. దరఖాస్తు చేసుకున్నారా?
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో విజేతకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే.. మీ క్రియేటివిటీ ఉపయోగ

Irctc Contest
IRCTC Contest : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో విజేతకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే.. మీ క్రియేటివిటీ ఉపయోగించి వీడియోలు చేయాలి. ఏదైనా పర్యాటక ప్రాంతం లేదా భారతీయ రైళ్లు లేదా రైల్వే గురించి లేదా ఐఆర్ సీటీసీ టికెటింగ్, టూరిజం సేవలను వివరిస్తూ వీడియో రూపొందించాలి.
ఇందుకోసం CoRover అనే సంస్థతో ఐఆర్ సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి వ్లాగింగ్(IRCTC Vlogging Contest) కాంటెస్ట్ చేపట్టాయి. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి 2021 ఆగస్టు 31 చివరి తేదీ.
ఈ పోటీలో పాల్గొనేవారు https://corover.ai/vlog/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకరు ఎన్ని వీడియోలైనా రూపొందించొచ్చు. వీడియోలో లైవ్ షూటింగ్ లేదా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉండాలి. రెండూ కలిపి వీడియో రూపొందించొచ్చు.
ఎంపికైన వీడియోలను ఐఆర్‌సీటీ అఫీషియల్ ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేస్తారు. ఆ వీడియో రూపొందించిన వారి పేరు కూడా డిస్‌స్క్రిప్షన్‌లో ఉంటుంది. ఈ కాంటెస్ట్‌లో గెలిచినవారికి లక్ష రూపాయల రివార్డ్ లభిస్తుంది. దీంతో పాటు సర్టిఫికెట్, ట్రోఫీ కూడా లభిస్తుంది.
* రన్నరప్‌కు రూ.50వేల క్యాష్ ప్రైజ్ తో పాటు సర్టిఫికెట్, ట్రోఫీ.
* సెకండ్ రన్నరప్‌కు రూ.25వేలు, సర్టిఫికెట్, ట్రోఫీ.
* వీడియో క్వాలిటీ, కంటెంట్‌ను పరిగణలోకి తీసుకొని 300 మంది విజేతలను ప్రకటిస్తారు.
* మొదటి ముగ్గురికి తప్ప మిగతా వారికి గిఫ్ట్ కార్డులు, రూ.500, సర్టిఫికెట్స్ ఇస్తారు.
Attention #travel lovers & #vloggers. #IRCTC & #CoRover are here with an exciting contest. Create a video & stand a chance to win big. Hurry! Last date for video submission is 31st Aug’21. #Contest #details on https://t.co/fA6pPNR6wm.
— IRCTC (@IRCTCofficial) August 24, 2021